రానా త్రిషల సహజీవనం ఒకప్పుడు అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఈ విషయాన్ని స్వయంగా రానా ఒక మీడియా ఇంటర్వ్యూలో కూడ వివరించాడు. ఆతరువాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ చాల బిజీగా ఉన్నారు. 
Tamil actor Arya makes his debut entry in Sandalwood
అయితే అనుకోకుండా మళ్ళీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా అన్న అనుమానాలు కోలీవుడ్ హీరో ఆర్యా చేసిన లేటెస్ట్ ట్విట్ వల్ల కలుగుతోంది. హీరో ఆర్యా హీరోయిన్ సాయేషాను పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈవిషయం అధికారికంగా ప్రకటింపబడగానే చాలామంది ఫిలిం సెలెబ్రెటీలు వీరిద్దరిని అభినందిస్తూ ట్విట్స్ చేసారు.
 మళ్లీ చిగురించిన రానా, త్రిష ప్రేమ
వీరిలో రానా త్రిషలు కూడ ఉన్నారు. వీరిద్దరూ వేరువేరుగా పంపిన అభినందన సందేశాలకు సమాధానం ఇస్తూ ఆర్యా ‘హా..హా.. థ్యాంక్స్ మచా.. మీ పెళ్లి పిలుపు కోసం వేచి చూస్తున్నాను’ అంటూ ఆర్యా ట్విట్ చేసాడు. దీనితో త్వరలో రానా త్రిషలు పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ అప్పుడే కోలీవుడ్ మీడియా గాసిప్పులు మొదలు పెట్టేసింది. 
కెరీర్‌పైనే త్రిషా దృష్టి
అంతేకాదు త్వరలోనే వీరిద్దరి పెళ్ళి ఖాయం అని వార్తలు వ్రాస్తూ వీరిద్దరి పెళ్ళికి రానా తల్లితండ్రులు అంగీకారం తెలియ చేసారు అంటూ అప్పుడే కోలీవుడ్ మీడియా ఊహాగానాలు కూడ మొదలు పెట్టేసింది.  దీనితో ఒకనాటి వీరిద్దరి లివింగ్ రిలేషన్ షిప్ కు ఆర్యా ట్విట్ తిరిగి జీవం పోసిందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో సెటైర్లు వినిపిస్తున్నాయి. స్నేహాలు మాత్రమే కాదు పెళ్ళిళ్ళు బ్రేకప్ లు కూడ క్షణక్షణం మారిపోతున్న రోజులలో నిజంగానే తిరిగి రానా త్రిషలు పెళ్ళి పీటలు ఎక్కినా ఆశ్చర్యం లేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: