తెలుగు, హిందీ భాషల్లో ఇప్పటి వరకు ఎన్నో కాంట్రవర్సీ చిత్రాలు తీసిన సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ ఈ మద్య టాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు.  గత కొంత కాలంగా వర్మ తీస్తున్న చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.  ఇటీవల అక్కినేని నాగార్జున తో ‘ఆఫీసర్’చిత్రాన్ని తెరకెక్కించారు..కానీ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 
Image result for laxmi ntr
ప్రస్తుతం వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుంచి నిన్నటి టీజర్ వరకు ప్రతి ఒక్క విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు.  నిన్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్  ట్రైలర్ ను ఉదయం 9.27 గంటలకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను కేవలం 24 గంటల్లో 40 లక్షల మంది వీక్షించారు. దీనిపై వర్మ హర్షం వ్యక్తం చేశారు.   
Image result for laxmi ntr
ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ...‘కేవలం 24 గంటల్లో లక్ష్మీస్ ‘ఎన్టీఆర్ ట్రైలర్’ ను 40 లక్షల మంది వీక్షించారు. ఆ దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు. ఎన్టీఆర్ కు మేమంతా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు. దీనికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ లింక్ ను జతచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: