టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు సంబంధించిన చెన్నై ఎడిషన్ ‘చెన్నై టైమ్స్’ ఈమధ్యనే నిర్వహించిన సర్వేలో ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018’ లిస్టులో ఏకంగా విజయ్ దేవరకొండ మూడవ స్థానాన్ని పొందడం కోలీవుడ్ టాప్ హీరోలను ఆశ్చర్య పరుస్తున్నట్లు టాక్. విజయ్ ధనుష్ లు లాంటి క్రేజీ హీరోలను వెనక్కు నెట్టి విజయ్ దేవరకొండకు వచ్చిన ర్యాంకింగ్ అత్యంత సంచలనంగా మారింది.
విజయ్ దేవరకొండ టాప్ 3
దీనితో హైదరాబాద్ కు సంబంధించిన యూత్ లోనే కాకుండా చెన్నై యూత్ లో కూడ విజయ్ దేవరకొండ మ్యానియా చాల ఎక్కువగా ఉంది అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి విజయ్ నటించిన ‘నోటా’ ఫెయిల్ అయిన తరువాత కూడ ఈ క్రేజీ హీరోకు చెన్నై యూత్ లో ఏర్పడ్డ క్రేజ్ అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 
Popular Singer Anirudh Handsome Photos Images Latest (10)
ఇక చెన్నై టైమ్స్ నిర్వహించిన ఈ సర్వేలో తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ మొదటి స్థానాన్ని పొందితే రెండవ స్థానంలో అధర్వా వచ్చాడు. ఇక తరువాత స్థానాలు హరిష్ కళ్యాణ్ శివ కార్తికేయన్ ధనుష్ శింబు దుల్కర్ సల్మాన్ ఆది అరవ్ లకు దక్కాయి. సాధారణంగా చెన్నై యూత్ తెలుగు హీరోలను పెద్దగా గుర్తించారు. అలాంటిది చెన్నై టైమ్స్ సర్వేలో విజయ్ దేవరకొండకు గుర్తింపు రావడంతో ఇక నుండి అతడి సినిమాలు అన్నీ తమిళనాడులో కూడ బాగా విడుదలయ్యే ఆస్కారం ఉంది. 
టాప్ 10 స్టార్స్
ఈ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో తమిళ సూపర్ స్టార్ విజయ్ 25 స్థానంలో ఉంటే చాలామంది కోలీవుడ్ టాప్ స్టార్స్ కు టాప్ 30లో చోటు దక్కించుకోక పోవడం గమనార్హం. అయితే ఆశ్చర్యకరంగా టాప్ 30లో సిద్ధార్థ్కు 16 స్థానం దక్కింది. వీరితోపాటు ఈ టాప్ 30 లిస్టులో  ఆర్య, జీవా జయం రవి తదితరులు ఉన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు వచ్చిన ఈ గుర్తింపుతో రానున్న రోజులలో ఇతడు నటించే సినిమాలు అన్నీ తెలుగు తమిళ భాషలలో సమాంతరంగా విడుదల అయ్యేలా నిర్మాతలు వ్యూహాలు రచించే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: