అన్న గారి అసలైన అభిమానులు అలాంటి ఇలాంటి వారు కాదు, వారు దేనికీ లొంగరు, ఏ ప్రలోభాలకు చిక్కరు. నిజానికి ఎన్టీఆర్ అభిమానులు ఎపుడో టీడీపీని వదిలేశారు. వారు చంద్రబాబుకు వ్యతిరేకులుగా కూడా ఉన్నారు. అటువంటి వారికి చాన్నాళ్ళకు ఓ పండుగ లాంటిదే అయిందట. దాంతో వారంతా శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.


సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తాజా సంచలనం లక్ష్మీస్  ఎన్టీఆర్ మూవీకి సంబంధించి వచ్చిన టీజర్ అసలైన అన్న గారి అభిమానులను తెగ సంతోషపెట్టిందట. నాలుగున్న నిముషాల టీజర్ ని చూసి నాటి అన్న గారి వ్యధను కధను  సరిగ్గా వర్మ హ్యాండిల్ చేశారని అంటున్నారుట. 1989 లో ఓటమి తరువాత ఎన్టీఆర్ కి కష్టాలు మొదలయ్యాయని, వాటిని పూసగుచ్చినట్లుగా వర్మ మాత్రమే చూపించగలరని వారు భావిస్తున్నారట.


దానికి రుజువుగా వర్మ  నిన్న రిలీజ్ చేసిన టీజర్ కేవలం గంట‌న్న‌ర‌లోనే 1 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ సంచ‌ల‌నం సృష్టించింది. ఇందులో మెజారిటీ నెటిజన్లు వర్మ డేరింగ్ ని మెచ్చుకుని ఆడు మగాడ్రా బుజ్జీ అంటూ కామెంట్స్ కూడా పెట్టారట. మేము అన్న గారి అభిమానులం, ఆ మహానుభావుడికి జరిగిన అవమానం చాలా దారుణం. ఇప్పటి తరానికి ఆయన గురించి ఏమీ తెలియదు. అపుడు కూడా కొన్ని మీడియా సంస్థలు లేనిది ఉన్నట్లుగా చూపించి తప్పు తోవ పట్టించాయి. 


మొత్తానికి మొత్తం కళ్ళకు కట్టినట్లు నిజాలు తీయాలి. మీరే తీయగలరు అంటూ వర్మకు కామెంట్స్ పెట్టడం బట్టి చూస్తే అసలైన ఎన్టీఆర్ అభిమానుల మద్దతు వర్మకు ఏ రేంజిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఎటూ అన్న గారి ఆత్మ తన వెంటనే ఉండి నడిపిస్తోందని  వర్మ చెప్పుకున్నారు. టోటల్ గా చూస్తే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అసలు కధను జనానికి చూపించి రికార్డులు బ్రేక్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితె అది రాజకీయంగా కూడా పెను సంచలనం క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: