ప్రపంచ స్థాయిలో అతి తక్కువ మంది స్టార్ హీరోలు చిరస్థాయిగా గుర్తింపు పొందినవారు ఉన్నారు.  ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు.  బాలీవుడ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేటివరకూ నటుడిగా అమితాబ్ ప్రయాణం కొనసాగుతూనే వుంది. కెరియర్లో ఎన్నో అవాంతరాలను నవ్వుతూనే అధిగమించిన ఆయన, ఈ రోజున బాలీవుడ్ కి పెద్ద బాలశిక్షగా నిలిచారు.  అమితాబ్ బచ్చన్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి, ఫిబ్రవరి 15 నాటికి 50 సంవత్సరాలు అయ్యింది.  

Image result for amitabh bachchan

1969 ఫిబ్రవరి 15 న అమితాబ్ నటించిన మొదటి సినిమా 'సాథ్ హిందుస్థానీ' షూటింగ్ ప్రారంభం అయ్యింది. అప్పటినుండి అంచెలంచెలుగా ఎదుగుతూ, బాలీవుడ్ బిగ్ బీ గా ఎదిగిన అమితాబ్ సినీ ప్రస్థానం.. ఎందరికో ఆదర్శం.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో అగ్ర నటుడిగా కొనసాగిన తర్వాత, వరస ఫ్లాప్‌లు, ఆర్థిక ఇబ్బందులు, చేతిలో సినిమాలు లేని పరిస్థితి.. కౌన్ బనేగా కరోడ్‌పతి షో కి హోస్టింగ్ చేసి, తిరిగి ఫామ్‌లోకి రావడం.. ఇలా.. ఎన్నో ఎత్తు, పల్లాలను చూసారు అమితాబ్.  తరాలు మారుతున్నా .. కొత్త హీరోలు వస్తున్నా ఆయన స్థానం సుస్థిరంగా ఉంటూ వచ్చింది. అలాంటి అమితాబ్ నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. 

Image result for amitabh bachchan completed 50 years in film industry

నటుడిగా సుదీర్ఘమైన ఆయన ప్రయాణంలో జాతిరత్నాల్లాంటి సినిమాలు .. ఆణిముత్యాల్లాంటి సినిమాలు మైలురాళ్లుగా కనిపిస్తాయి. నటుడిగా ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సన్నిహితులంతా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.  అమితాబ్ ఫోటోతో డిజైన్ చేసి, ఐకాన్ అని రాసి ఉన్న టీ-షర్ట్ వేసుకున్న పిక్ షేర్ చేస్తూ...  నా తండ్రి, బెస్ట్ ఫ్రెండ్, గైడ్, బెస్ట్ క్రిటిక్, హీరో.. 50 ఏళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజు తన సినీ జర్నీ స్టార్ట్ చేసారు. 

Image result for అమితాబచ్చన్ ఫ్యామిలీ

ఇవాళ్టికి కూడా పని పట్ల తనకున్న ఆసక్తి, ప్రేమ, నిబద్దత ఏమాత్రం తగ్గలేదు..విషెస్ చెబుదామని నేను అయన రూమ్ కి వెళితే తయారవుతున్నారు .. 'ఎక్కడికి నాన్న?' అంటే 'పనికి' అంటూ సమాధానం ఇచ్చారు. అందుకే ఆయన నా మార్గదర్శకుడు .. విమర్శకుడు'  అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.  అమితాబ్ ప్రస్తుతం.. బద్లా, బ్రహ్మాస్త్ర సినిమాలు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: