టాలీవుడ్ లో పటాస్ సినిమా తర్వాత నందమూరి కళ్యాన్ రామ్ కి ఒక్క హిట్ కూడా లేదు.  ఆ మద్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆ సినిమా కమర్షియల్ హిట్ కాలేక పోయింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా అన్ని డిజాస్టర్స్ అయ్యాయి.  నటుడిగానే కాకుండా నిర్మాతగా కొనసాగుతున్న కళ్యాన్ రామ్ ఆ మద్య ఎన్టీఆర్ హీరోగా జై లవకుశతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘118’. 


సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులముందుకు రాబోతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేయగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియాట్రికల్ ట్రైలర్ విడుదల చేసి చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఒక నిమిషం 53 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో మొదట షాలిని పాండేతో కళ్యాణ్ రామ్ రొమాన్స్ సన్నివేశాలను చూపిస్తూ మెల్లగా సినిమాలోని ఆసక్తికర సన్నివేశాలను ముందుంచారు.  


ఉందో లేదో తెలియని ఓ అమ్మాయి మర్డర్ మిస్టరీని కళ్యాణ్ రామ్ ఛేదించడం.. ఏ పనిచేసినా లాజిక్‌గా ఆలోచించే కళ్యాణ్ రామ్.. లాజిక్ లేని పనికోసం సీరియస్‌గా ఆలోచించడం.. చివరికి ఆ లాజిక్‌ ‘118’తో ముడి పడి ఉండటం చాలా థ్రిల్లింగ్ ఉంది.   ‘స్టార్ట్ చేసింది ఏదైనా సగం లో ఆపాలంటే నాకు చిన్నపట్నుంచి చెడ్డ చికాకు ఏంటో వెధవ క్యూరియాసిటీ’అంటూ కళ్యాన్ రామ్ డైలాగ్స్ చూస్తుంటే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సరికొత్త లుక్‌లో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, ‘అర్జున్ రెడ్డి’ ఫేం షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: