ఈవారం వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన సినిమాలు యూత్ కు ఏమాత్రం కనెక్ట్ అవ్వకపోవడంతో ఈ వీకెండ్ కూడ మన తెలుగు రాష్ట్రాలలో ‘ఎఫ్ 2’ సందడి కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. దీనితో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన ఈమూవీ కలక్షన్స్ మరొక రికార్డ్ ను అందుకోబోతున్నాయి. 
అనిల్ చీట్ చేశాడు
దీనితో ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘ఎఫ్ 2’ మాటలే వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ సాధించిన అఖండ విజయం గురించి మాట్లాడుతూ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈమూవీ పై ముఖ్యంగా అనీల్ రావిపూడి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. 
ఆ క్రెడిట్ అనిల్ రావిపూడిదే
తాను తీసిన సినిమాల వరస విజయాలతో దూసుకుపోతున్న అనీల్ రావిపూడి సినిమాలను పరిశీలిస్తే పాత సినిమాలలో కొన్నింటిని ప్రేరణగా తీసుకుని చాల తెలివిగా తన సినిమాలకు అనిల్ రావిపూడి కథలు వ్రాస్తున్నాడు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు పరుచూరి. ముఖ్యంగా అనిల్ రావిపూడి తీసిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం పరిశీలిస్తే ‘ఒక్కడు’ చిత్రం గుర్తుకు వస్తుందని అంటూ కామెంట్ చేసాడు. అలాగే ‘ఎఫ్ 2’ చిత్రం కూడా ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమా కథ నుండి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది అంటూ నిశితమైన విమర్శలు చేస్తున్నాడు.
paruchuri gopalakrishna comments on agnathavasi failure
ముఖ్యంగా ‘ఎఫ్ 2’ కథ ఫస్ట్ హాఫ్ లో మాత్రమే బాగుంటుంది అని అయితే అనిల్ రావిపూడి తెలివిగా సెకండ్ హాఫ్ తో ఆడియన్స్ ను చీట్ చేసాడు అంటూ పరుచూరి వేసిన సెటైర్లు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఈమూవీ ఫస్ట్ హాఫ్ చూసిన ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ లో హీరోయిన్లకు బుద్ది వచ్చేలా కథ ఉంటుందని అనుకుంటారని అయితే అనిల్ రావిపూడి తెలివిగా ప్రేక్షకులను చీట్ చేస్తూ హీరోయిన్స్ హీరోలకు బుద్ధి వచ్చేలా డిజైన్ చేసిన కథ అనిల్ రావిపూడి ప్రతిభకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు. భార్య భర్తల నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఎప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది అన్న విషయం ‘ఎఫ్ 2’ సక్సస్ మరొకసారి రుజువు చేసింది అంటూ పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: