మొన్న వాలెంటైన్స్ డే నాడు విడుదలైన నాగచైతన్య సమంతల ‘మజిలీ’ మూవీ ట్రైలర్ కు ఎవరు ఊహించని విధంగా కేవలం 24 గంటల లోపే 5 మిలియన్స్ వ్యూస్ రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారడమే కాకుండా దీనివెనుక మర్మం ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీ ట్రైలర్ కు పోటీగా విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ట్రైలర్ కు మూడు లక్షల హిట్స్ వస్తే అదేవిధంగా సూర్య నటించిన మూవీ ‘ఎన్ జీకె’ మూవీ ట్రైలర్ కు కూడ చైతన్య ‘మజిలీ’ స్థాయిలో హిట్స్ రాలేదు.
Naga-samantha
దీనితో నాగచైతన్య సినిమాల ట్రయిలర్లు, టీజర్లకు ఇంత క్రేజ్ ఉందా ? లేదంటే ఈ వ్యవహారం అంతా ఆర్టిఫిషియల్ హిట్ లు తెప్పించే ఏజెన్సీల సహకారంతో జరిగిందా అన్న కోణంలో ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.  అంతేకాదు ‘మజిలీ’ ట్రైలర్ కు అయిదువేల కామెంట్లు లక్షన్నర లైకుల వ్యవహారాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోవడమే కాకుండా ఆర్టిఫిషయల్ గా హడావుడి చేయవచ్చు కానీ మరీ ఇంతలాగా అంటూ సెటైర్లు వేసుకుంటున్నట్లు టాక్.

ప్రస్తుతం ఈవిషయమై హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ వ్యవహారం వెనుక సమంత హస్తం ఉందని చైతన్య సినిమాలు ఫెయిల్ అయినా అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అన్న విషయాన్ని స్పష్టం చేయడానికి వ్యూహాత్మకంగా ఈ వ్యవహారం సమంత వెనక ఉండి నడిపించింది అనీ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అయితే ఈమూవీ యూనిట్ వర్గాలు మాత్రం ఈ ట్రైలర్ విషయంలో ఎక్కడా ఎటువంటి మ్యానిపిలేషన్ లేదని పూర్తిగా  జనాలకు నచ్చబట్టే ఇలాంటి హిట్స్ వచ్చాయి అని అంటున్నట్లు టాక్.
akkineni naga chaitanya, samantha new film majili shooting starts
అయితే మరికొంతమంది ‘మజిలీ’ ట్రైలర్ కు వచ్చిన స్పందన పై మరొక విధంగా స్పందిస్తున్నారు. ఇది అంతా సమంత క్రేజ్ బట్టి నడిచిన వ్యవహారం అనీ కేవలం చైతూ సినిమాకు అయితే ఈ రేంజ్ లో హిట్స్ రావనీ విశ్లేషణలు చేస్తున్నారు. ఏది ఏమైనా ‘మజిలీ’ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చినా ఆ ఖ్యాతి నాగచైతన్య అకౌంట్ లో పడకుండా విమర్శలు రావడం దురదృష్టకరం..   


మరింత సమాచారం తెలుసుకోండి: