తెలుగు సినిమా పరిశ్రమలో పోకిరి సినిమాకు ఓ బ్రాండ్ ఉంది. అప్పటిదాకా ప్రిన్స్ గా ఉన్న మహేష్ కాస్త సూపర్ స్టార్ గా మారేలా చేసిన సినిమా అది. పూరి జగన్నాథ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్షన్ కు తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన కానుక. సినిమా బడ్జెట్ అది తెచ్చిన వసూళ్లు ట్రేడ్ వర్గాలనే షాక్ అయ్యేలా చేశాయి.


అప్పటిదాకా ఉన్న రికార్డులన్నిటిని బ్రేక్ చేసి మహేష్ తన పేరు మీద సరికొత్త రికార్డులను రాసుకున్నాడు. ఇదిలాఉంటే ఆ సినిమా తర్వాత మహేష్ సూపర్ స్టార్ గా ఎదిగి వరుసగా సినిమాలు చేస్తూ ఆ స్టార్డం కొనసాగిస్తున్నాడు. ఇక మరోపక్క పూరి కూడా కొన్నాళ్లు ఆ క్రేజ్ తో సినిమాలు చేసినా ఇప్పుడు వెనుకపడ్డాడు.


టెంపర్ తర్వాత పూరి చేస్తున్న ఏ సినిమా కూడా హిట్ కు నోచుకోలేదు. అందుకే ఈసారి తన హిట్ ఫార్ములాతో వస్తున్నాడట పూరి. ఎనర్జిటిక్ స్టార్ రాం తో పూరి చేస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈమధ్యనే మొదలైన ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో తిరుగుతుంది. సినిమా పోకిరి సీక్వల్ గా వస్తుందని.. అందులో లానే ఈ సినిమాలో కూడా ట్విస్ట్ అదిరిపోతుందని అంటున్నారు.


పోకిరి సినిమా లానే ఇస్మార్ట్ శంకర్ లో కూడా పూరి మార్క్ ట్విస్ట్ ఒకటి పెడుతున్నాడట. మరి ఇది కొత్తగా ఉంటుందా లేక పోకిరిని పోలినట్టు ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను చార్మి కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతుంది. మరి ఈ సినిమా అయినా పూరికి హిట్ ఇస్తుందేమో చూడాలి.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: