తళుక్కుమనే తార మిల్కీ బేబీ తమన్నా. హాట్ బ్యూటీగా టాలీవుడ్ని దశాబ్ద కాలంగా ఏలుతున్న ఈ అమ్మడు డ్యాన్సులు విరగదీస్తుందన్నది తెలిసిందే. సరైన సాంగ్ పడాలి కానీ తమన్నా ఊపు ఆపలేరంటారు. టాప్ గేర్ లో స్వింగ్ జరా అంటూ సాంగేసిందంటే యూత్ హార్ట్స్ అన్నీ స్వింగ్ అవాల్సిందే. లేటెస్ట్ హిట్ ఎఫ్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న తమన్నా దట్ ఈజ్ మహాలక్ష్మి అంటోంది. 


ఇక ఈ ముద్దు గుమ్మను వెతుక్కొంటూ ఓ ఐటెం సాంగ్ వచ్చిందంట. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకు ఆది హీరోగా నటిస్తున్న ఓ మూవీలో మిల్కీ బేబీని ఐటెం సాంగ్ చేయమంటున్నారుట. ఆ మూవీకి తమన్న డ్యాన్స్ హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. దీనికి ఓకే చెప్పిన మిల్కీ బేబీ మరో ఐటెం తో కుర్ర గుండెల్లో కేక‌ పుట్టించడానికి రెడీ అంటోంది.


తమన్నా ఇప్పటివరకూ చేసిన ఐటం సాంగ్స్ అన్నీ వీర లెవెల్లో హిట్ అయ్యాయి. లవకుశలో స్వింగ్ జరా ఇప్పటికీ జనాన్ని ఊపేస్తూంటే అల్లుడు సీను, స్పీడున్నోడు వంటి మూవీస్ లో  సాంగ్స్ ఓ మోత మోగుతున్నవే. అటువంటిది తమన్నా మళ్ళీ ఐటెం బాంబ్ అవతారం ఎత్తితే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. అన్నట్లు తనకు ఐటెం సాంగ్స్ చేయడం చాలా ఇష్టమని ఈ మధ్యే తమన్నా  భారీ స్టేట్మెంట్  కూడా ఇచ్చింది కూడా తనకు డ్యాన్స్ చేయాలన్న కోరిక అలా తీరుతుందని కూడా ఆ అమ్మడు చెప్పుకొచ్చింది. సో తమన్నా  మరో ఐటెం బాంబ్ కోసం వైట్ అండ్ సీ


మరింత సమాచారం తెలుసుకోండి: