‘పటాస్’ మూవీ తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా నిలదొక్కుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నం కలిసిరాలేదు. మధ్యలో నిర్మాతగా చేసిన ప్రయత్నాలు కూడ ఈ నందమూరి హీరోకు షాక్ ఇచ్చాయి. అయినా తన నమ్మకాన్ని పోకోట్టుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. 
Kalyan Ram in 118
కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా నటిస్తున్న ’118’ మూవీ మార్చి 1న విడుదల కాబోతోంది. ఒక క్రైం థ్రిల్లర్ గా రూపొందింపబడ్డ ఈమూవీలో కళ్యాణ్ రామ్ పక్కన ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ శాలినీ పాండే నివేధితా దామాస్ లు నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి. గుహన్ ఈమూవీని చాల డిఫరెంట్ గా ఒక సస్పెన్స్ ధ్రిల్లర్ గా నేటి తరం ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసాడని ఈ మూవీ పై పాజిటివ్ టాక్ ఉంది.
Kalyan Ram's 118 Movie Teaser Talk: A Decent First Impression
కళ్యాణ్ రామ్ కు కూడ ఈమూవీ పై చాల నమ్మకం ఉండటంతో ఈమూవీని ప్రమోట్ చేస్తూ అప్పుడే ఇంటర్వ్యూలు మొదలు పెట్టేసాడు. ఈ సందర్భంలో కళ్యాణ్ రామ్ ఈమూవీ కథ గురించి మాట్లాడుతూ తనకు ఈసినిమా కథ వినగానే తన మైండ్ లోకి వచ్చిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
kalyan ram is doing some risky shots for '118' movie
ఈ కథ అన్ని విధాల జూనియర్ బాడీ లాంగ్వేజ్ కి నచ్చుతుంది అని తనకు అభిప్రాయం కలిగినా ఈమూవీ నిర్మాతలు తనను హీరోగా చేయమని బలవంత పెట్టడంతో తాను ఈకథను జూనియర్ కు చెప్పకుండానే తానే నటించాను అని అంటున్నాడు. అయితే ఈ కామెంట్స్ పై జూనియర్ అభిమానులు మరొక విధంగా స్పందిస్తున్నారు. జూనియర్ రేంజ్ కి తగ్గ కథను ఎంచుకుని కళ్యాణ్ రామ్ నటించే ప్రయత్నం చేసినా జూనియర్ స్థాయిలో కళ్యాణ్ రామ్ ఎలా మెప్పించ గలడు అంటూ కళ్యాణ్ రామ్ పై జోక్స్ వేస్తున్నారు జూనియర్ అభిమానులు..  


మరింత సమాచారం తెలుసుకోండి: