ఎన్టీఆర్ ట్రైలర్ లో అన్ని సన్నివేశాల గురించి ఎవరు మాట్లాడటం లేదు కానీ ఒక సన్నివేశం మాత్రం చాలా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇందిరాగాంధీ ఎన్టీఆర్  విగ్రహానికి దండం పెట్టడం. ఇది ఎంత కల్పితమైన సన్నివేశమో వేరే చెప్పాల్సిన పని లేదు. ఒక దేశ ప్రధానిని.. అమెరికా అధ్యక్షులతో సైతం ధైర్యంగా సంభాషించిన ఏకైక భారత ప్రధానమంత్రిగా పేరున్న మహిళను.. ప్రతిపక్షానికి చెందిన  వాజ్ పేయి చేత ‘దుర్గ..’గా కీర్తింపబడిన ఇందిరను ఆఖరికి ఇంత దిగజార్చి చిత్రీకరించడానికి మించి.. ఈ సినిమా రూపకర్తల పతనావస్థ ఏముంటుంది?

Image result for ntr mahanayakudu

ఎన్టీఆర్ గొప్పోడు.. ఎన్టీఆర్ గొప్పోడు.. దీనికోసమని ఎవరి గురించి అయినా ఇలాంటి కల్పిత సన్నివేశాలు క్రియేట్ చేయడమేనా! ఆల్రెడీ అలాంటి ప్రయత్నం చేసి తొలిభాగంలో వైఫల్యం చెందినా.. మళ్లీ అంతకు మించిన భజన చేయడం అంటే.. తెగించడమే. చరిత్రతో సంబంధం లేదు, ఎవరు ఏమనుకుంటారనే భయాలు ఏమీలేవు, కల్పిత ఘటనలతో.. ఇలా భారత దివంగత ప్రధానిని కూడా తమ సినిమా కటౌట్ ను కృష్ణుడిని పోల్చుకోని వ్యక్తిగా చూపించేశారు.

Image result for ntr mahanayakudu

ఈ ఒక్క ఘట్టం చాలు.. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ టూకు తటస్థులు పూర్తిగా దూరం కావడానికి! అయితే ఈ సినిమాను కూడా కలెక్షన్లను, విజయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా.. కేవలం ఎన్టీఆర్ భజన కోసం మాత్రమే రూపొందిచారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్లో ఎన్టీఆర్ కటౌట్ కు ఇందిర దండం పెడుతున్నట్టుగా చూపితే.. అదే ఇందిరకు ఎన్టీఆర్ దండం పెడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదీ కథ.


మరింత సమాచారం తెలుసుకోండి: