ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో బయోపిక్ ల హవా నడుస్తున్న సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడ ఈ ట్రెండ్ ప్రస్తుతం విపరీతంగా కొనసాగుతోంది. రానున్న రోజులలో తెలుగులో చాలా బయోపిక్ లు వచ్చే ఆస్కారం కనపడుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ నాగబాబు చిరంజీవి బయోపిక్ పై చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 
 à°šà°¿à°°à°‚జీవి జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఎంతోమందికి స్పూర్తి కావడంతో అయన జీవితం పై ఒక బయోపిక్ తీసే ఆలోచన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు వచ్చింది అన్న వార్తల పై స్పందిస్తూ నాగబాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  తన అన్నయ్య  జీవితంలో ఆసక్తికర మలుపులు ఏమీ లేవు కాబట్టి  చిరు  జీవితంపై బయోపిక్ వస్తుందని తాను అనుకోవడం లేదని ఒకవేళ వచ్చినా అది సంచలన విజయం సాధిస్తుంది అని తాను అభిప్రాయపడటం లేదు అని చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ఒకే వేదిక మీద చిరంజీవి , బాలకృష్ణ .. సూపర్ స్కెచ్ వేసిన బోయపాటి శ్రీను
అయితే మెగా బ్రదర్ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించడం లేదు. అంతేకాదు చిరంజీవి పాత్రలో తాము రామ్ చరణ్ ని చూడాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చిన్న పాత్రలో చేస్తూ మెగా హీరో స్థాయికి ఎదిగిన చిరంజీవి జీవితం నేటి యువతరానికి స్ఫూర్తి దాయకం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
ఇండస్ట్రీ రాజకీయాలను లెక్క చేయకుండా కేవలం తన స్వయం కృషితో ఎదిగి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేసి భారతదేశ అధ్యక్షుడి ప్రశంసలు కూడ పొందిన చిరంజీవి జీవితంలో చీకటి కోణాలు లేకపోయినా ఎన్నో మలుపులు ఉన్నాయని అవన్నీ ఆసక్తికరంగా చూపెడితే చిరంజీవి బయోపిక్ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీనితో నాగబాబు అభిప్రాయం మారుతుందా ? లేకుంటే అదే అభిప్రాయాన్ని కొనసాగిస్తాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: