రకుల్ ప్రీత్ సింగ్.. కుర్ర కారు గుండెల్లో గుచ్చుకుపోయే అందం. కొన్నేళ్ళుగా టాలీవుడ్లో తన సోయగాల దెబ్బలో  చిట్టి గుండెలను  అబ్బా అనిపిస్తూ వచ్చింది. వెంకట్రాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ ద్వారా తెరంగ్రేట్రం చేసిన ఈ అమ్మడు ఆ స్పీడ్ ఎక్కడా అపలేదు. జోరు మీద ఉండగానే స్టార్ స్టాటస్ సంపాదించేసింది. అందరు అగ్ర హీరోల పక్కన ఒక రేంజిలో వెలిగిన రకుల్ తాజాగా వచ్చిన అన్న గారి బయోపిక్ లో శ్రీదేవిలా కూడా కనిపించి మురిపించింది.


అటువంటి అమ్మడికి చాన్సులు ఇపుడు బాగా తగ్గాయి. గత ఏడాది అయితే రకుల్ లేకుండానే టాలీవుడ్లో సినిమాలు వచ్చేశాయి. ఇక లాభం లేదనుకున్న ఈ ముద్దు గుమ్మ తన టాలీంట్ కి పదును పెట్టింది. దాంతో ఇపుడు చేతిలో రెండు మూవీస్ వచ్చేసాయంట. తన పరిచయాలతోనే వాటిని దక్కించుకున్న రకుల్ మరిన్ని చాన్సుల కోసం ఇపుడు మాస్టర్ ప్లాన్ వేసిందని అంటున్నారు. తాజాగా వచ్చిన రెండు మూవీలో ఒకటి వెంకీ మామలో నాగ చైతన్య పక్కన అయితే రెండోది బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ. ఈ రెండు మూవీస్ తో పాటు రకుల్ ఇపుడు మరో ఆఫర్ ని కూడా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇస్తోంది.


అదేంటంటే సీనియర్ హీరోల పక్కన చేసేందుకు కూడా తనకు ప్రాబ్లం లేదని అంటోంది. దాంతో మొదటి చాన్స్ బోయపాటి ఇచ్చేశారట. ఆయన బాలయ్యతో తీయబోయే మూవీలో జతగా రకుల్ ని ఎంచుకున్నారట. ఈ మూవీతో రకుల్ ఖాతాలో మూడు మూవీస్ అయినట్లే. ఇక టాలీవుడ్ సీనియర్లు వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లాంటి వారు ఉన్నారు. వారి మూవీస్ లో  చాన్సులు దక్కితే రకుల్  కొంతకాలం పాటు టాలీవుడ్లో బాగానే కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే టాలెంట్ రకుల్ సొంతం అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: