అక్కినేని నవతరం హీరో అఖిల్. చాక్లెట్ బాయ్ లా ఉండే అఖిల్ నాగార్జున వారసుడిగా టాలీవుడ్లోకి వచ్చేశారు. అన్న నాగ చైతన్య స్టైల్ కి భిన్నంగా అఖిల్ తనకంటూ ఓ పద్ధతిలో మూవీస్ చేస్తున్నాడు. ఇప్పటికి మూడు మూవీస్ ని రిలీజ్ చేసిన అఖిల్ కి నటనా పరంగా మంచి మార్కులే పడ్డాయి. రేపటి తరం సూపర్ స్టార్ అని అఖిల్ ని అంతా అంటారు.


అయితే అఖిల్ కి సరైన హిట్ ఇప్పటికీ దోరకలేదు. తొలి మూవీ అఖిల్ భారీ అంచనాల మధన వచ్చి డిజాస్టర్ అయింది. ఆ తరువాత హలో అంటూ పలకరించినా పెద్దగా స్పందన లేదు. లేటెస్ట్ గా మిష్టర్ మజ్ఞూ అంటూ అఖిల్ వచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ అయితే దక్కింది కానీ సాలిడ్ హిట్ మాత్రం రాలేదు. దాంతో అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటన్నది అందరిలోనూ  ఇంటెరెస్ట్ పెరిగిపోయింది. అయితే అఖిల్ ఈసారి కచ్చితంగా బంపర్ హిట్ కొట్టే స్కీంలో ఉన్నాడని అంటున్నారు. అఖిల్ కి ఆ హిట్ ఇచ్చే బాధ్యతను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తీసుకున్నారని తెలుస్తోంది. తన కొడుకుని అల్లు వారికి నాగార్జున అప్పగించేశారని భోగట్టా


తన గీతా ఆర్ట్స్ బేనర్లో అఖిల్ తో ఓ మూవీకి అరవింద్ ప్లాన్ చేశారట. దీనికి గీతావోవిందం డైరెక్ట్ చేసిన పరశురాం కానీ లేక మరో యూత్ డైరెక్టర్ కానీ అఖిల్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. మెగా బ్యానర్ అందునా అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ అంటే ఆ మూవీ ఇక సూపర్ హిట్ అనుకోవాల్సిందే. అఖిల్ కి బంపర్ మూవీ చేతిలో పడినట్లే. ఇక గీతా ఆర్ట్స్ తో అక్కినేని వారికి అనుబంధం ఉంది. అపుడెపుడో తాత ఏయన్నార్ చిరంజీవితో కలసి ఈ మెగా బ్యానర్లో మెకానిక్ అల్లుడు చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకు మనవడు అఖిల్ చేస్తున్నాడు. గ్యారంటీగా హిట్ అని అక్కినేని అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: