టాప్ హీరోతో సినిమా చేసే అవకాసం వచ్చి ఆసినిమా చేయిజారిపోయే పరిస్థుతులు ఏర్పడితే ఎంతటి టాప్ డైరెక్టర్ కు అయినా అది చెప్పుకోలేని అవమానంగా మారుతుంది. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్తర్ హిట్ తీసిన సుకుమార్ మహేష్ దగ్గర పడుతున్న పాట్లు బయటకు చెప్పుకోలేని విధంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Sukumar Latest Interview Photos07
స్వతహాగా సినిమాలను చాల స్లోగా తీస్తాడు అని పేరున్న సుకుమార్ మహేష్ కు నచ్చే కథలను వెను వెంటనే మార్చిమార్చి చెప్పలేకపోవడం దీనికితోడు తన సొంత నిర్మాణ సంస్థ వ్యవహారాల పై ఎక్కువ దృష్టి పెట్టడం వంటి కారణాలతో మహేష్ సినిమా వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోవడం సుకుమార్ కు తీవ్ర అవమానంగా మారింది అని అంటున్నారు. తనతో సినిమాను చేస్తాను అని తనంతట తానుగా అడిగిన మహేష్ ఇప్పుడు అనిల్ రావిపూడి వైపు చాల వేగంగా అడుగులు వేయడం సుకుమార్ జీర్ణించుకోలేక పోతున్నాడని టాక్.

దీనితో ఆఖరి ప్రయత్నంగా సుకుమార్ మహేష్ కు కాల్ చేసి మరో కధను వినిపించడానికి టైమ్ ఇమ్మని అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే అనీల్ రావిపూడి వైపు పూర్తిగా మొగ్గు చూపుతున్న మహేష్ తనకు పూర్తిగా ఇష్టం లేకపోయినా సుకుమార్ ని నిరాశపరచడానికి ఇష్టం లేక సుకుమార్ చెప్పే కొత్త కథ వింటానని మాట ఇచ్చాడని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

అయితే ఈ వ్యవహారం పై సుకుమార్ కంటే ఈమూవీని నిర్మించబోయే మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతలకు టెన్షన్ పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈసినిమాలో నటించడానికి అంగీకరించినందుకు కాను మహేష్ కు దర్శకత్వం వహించడానికి సుకుమార్ కు మైత్రిమూవీస్ సంస్థ భారీ మొత్తాలలో అడ్వాన్స్ లు ఇచ్చింది. ఇప్పటికే తాము నిర్మిస్తున్న సినిమాల వరస పరాజయాలతో సతమతమవుతున్న తమ నిర్మాణ సంస్థ మహేష్ సుకుమార్ ల మూవీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కకపోతే తమ పరిస్థితి ఏమిటి అంటూ మైత్రీ  మూవీస్ నిర్మాతలు తెగ మధన పడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..   
 


మరింత సమాచారం తెలుసుకోండి: