ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతికీ ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్న విబేధాలు అందరికీ తెలిసినవే. అవన్నీ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ నేపథ్యంలో మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనికితోడు పలు యూట్యూబ్ ఛానల్స్ లక్ష్మీపార్వతిని మళ్లీ ఇంటర్వ్యూ చేస్తున్నాయి.

lakshmi parvathi AND JUNIOR NTR కోసం చిత్ర ఫలితం


ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పైనా సంచలన ఆరోపణలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్టీఆర్ కుటుంబం పట్టించుకోని రోజుల్లో తాను చాలా చేయూత ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్‌ని తాను చాలా బాగా చూసుకున్నానంటున్నారు.

lakshmi parvathi AND JUNIOR NTR కోసం చిత్ర ఫలితం


జూనియర్ ఎన్టీఆర్ కు త్యాగరాజ గాన సభలో అరంగేట్రం చేయించడం ద్వారా మంచి అవకాశం ఇప్పించానని గుర్తు చేసుకున్నారు. గడిచిపోయిన గతం కదా.. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ అవన్నీ మరచిపోయారు అని లక్ష్మి పార్వతి నిట్టూరుస్తున్నారు. రామారావు గారితో వివాహం అయిన మొదట్లో లక్ష్మీపార్వతే జూనియర్ ఎన్టీఆర్‌ని తమ ఇంటికి పిలిపించిందట.

lakshmi parvathi AND JUNIOR NTR కోసం చిత్ర ఫలితం


ఎంతైనా అతను కూడా తన మనవడే కదా పిలిపించి ఫోటోలు తీయించిందట. తాను, జూనియర్, ఎన్టీఆర్ ముగ్గురూ కలిసి ఫొటో దిగారట. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ ఉండి తమ భుజాలపై చేతులు వేసి మరీ ఫొటో దిగాడట. అప్పట్లో తనతో జూనియర్ బాగానే ఉండేవాడట. ఆ తర్వాత లక్ష్మీపార్వతి ఫొటో చింపి అవతల పడేశాడట జూనియర్ ఎన్టీఆర్. వాడు ఎప్పుడూ తాత గారితో ఉన్న ఫొటోనే చూపిస్తాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతైనా వాడూ ఏమీ తక్కువ కాదు కదా.. ఎవరికీ మినహాయింపు కాదు.. అంటోంది లక్ష్మీపార్వతి.


మరింత సమాచారం తెలుసుకోండి: