తెలుగు ఇండస్ట్రీలో సూపర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళ్లింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క గత కొంత కాలంగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ వస్తుంది.  ఇప్పటికే అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి చిత్రాల్లో నటించి మెప్పించిన అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 
Image result for anushka kona
హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న కొత్త ప్రాజెక్టు ‘సైలెంట్‌’. అయితే ఈ చిత్రంలో రానా ఓ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారట.  ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో ‘రుద్రమదేవి’,‘బాహుబలి’, ‘బాహుబలి 2’చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
Image result for anushka kona
పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.  ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు   నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: