'వినయ విధేయ రామ' ఫెయిల్యూర్ తో ఈమూవీ డిస్ట్రిబ్యూటర్లు సుమారు 30 కోట్లు నష్ట పోవడంతో పాటు ఈ పరాజయాన్ని అంగీకరిస్తూ రామ్ చరణ్ వ్రాసిన బహిరంగ లేఖ అంతర్లీనంగా దర్శకుడు బోయపాటిని టార్గెట్ చేసే విధంగా ఉండటంతో బోయపాటితో సినిమాలు తీయాలని భావించిన నిర్మాతలు అంతా ఒక్కరోక్కరు గా సైడ్ అవుతున్న పరిస్థితులలో కేవలం బోయపాటికి ఇచ్చిన మాట పై కేవలం బాలయ్య మాత్రమే నిలపడ్డాడు. 
బాలయ్యతో రూ. 70 కోట్ల బడ్జెట్ సినిమా ప్లాన్ చేశారా?
దీనితో రెట్టించిన ఉత్సాహంతో బోయపాటి బాలయ్య ప్రాజెక్ట్ పై అనుసరిస్తున్న వ్యూహాలకు బాలకృష్ణ చెక్ పెడుతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు  బోయపాటి బాలకృష్ణతో త్వరలో మొదలు పెట్టబోతున్న తన సినిమాకు భారీ తనం గ్రాండ్ లుక్ తీసుకు రావడంకోసం 70 కోట్ల బడ్జెట్ అంచనాలువేసి ఈ సినిమాను నిర్మిoచ బోతున్న బాలకృష్ణ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం.  
సినిమా ఎప్పుడు మొదలు?
అయితే ఈ మితిమీరిన 70 కోట్ల బడ్జెట్ ను చూసి బాలకృష్ణ షాక్ అయి ప్రస్తుత పరిస్థుతులలో ఈసినిమాకు 70 కోట్ల బడ్జెట్ ఏమంత శ్రేయస్కరం కాదు అంటూ బాలయ్య బోయపాటి సూచనలతో విభేదించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇలాంటి భారీ బడ్జెట్ వల్ల మూవీ ప్రాజెక్ట్ కు మార్కెటింగ్ సమస్యలు ఏర్పడతాయని అందువల్ల ఈమూవీని 50 కోట్ల బడ్జెట్ తో పూర్తి అయ్యేలా తీయమని బాలయ్య బోయపాటికి స్పష్టమైన షరతులు పెట్టినట్లు టాక్. 

అత్యంత భారీ సినిమాలు తీసే అలవాటు ఉన్న బోయపాటి బాలయ్య షరతులు విని ఈమూవీ బడ్జెట్ ను ఎలా తగ్గించాలో తెలియక తెగ ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే రాబోతున్న ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని బాలయ్యకు తెలుగుదేశం అధినాయకత్వం నుండి సంకేతాలు అందుతున్న నేపధ్యంలో ఎన్నికల తరువాత మాత్రమే బాలయ్య బోయపాటిల మూవీ షూటింగ్ ఉంటుంది అని అంటున్నారు.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: