టాలీవుడ్ లో హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నిఖిల్..స్వామిరారా సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటూ వస్తున్నాడు.  నిఖిల్ నటించిన ‘ముద్ర’సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా అదే సినిమా టైటిల్ తో ఓ సినిమా రిలీజ్ కావడంతో ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి.  నిర్మాత నట్టికుమార్ ఈ మధ్యనే ఇదే టైటిల్ తో జగపతిబాబు హీరోగా ఓ సినిమా రిలీజ్ చేసారు. దాంతో  టైటిల్‌పై జరిగిన గొడవలో హీరో నిఖిల్‌ కాస్త వెనక్కితగ్గి.. టైటిల్ ని   ‘అర్జున్‌ సురవరం’ అని మార్చేశాడు.  అంతా ఓకే అనుకొని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో మరో కొత్త సమస్య ఎదురైనట్లు ఫిలిమ్ వర్గాల్లో గుస గుస.
Image result for nikhil movie
ఇక ఫిలిమ్ వర్గాల టాక్ ప్రకారం..ఈ సినిమా ఎడిటింగ్ పూర్తి అయ్యి ఫైనల్ వెర్షన్ చూసుకున్నాక సంతృప్తి చెందలేదట. ఎడిటర్ నవీన్ నూలి తను అనుకున్నట్లు ఎడిట్ చేయలేదని డైరక్టర్ భావించడంతో సమస్య మొదలైంది. ఈ నేపథ్యంలో తమిళ ఒరిజనల్ ని ఎడిటింగ్ చేసిన భువన శ్రీనివాసన్ ని తీసుకొచ్చి ఎడిటింగ్ చేయించాలని పట్టుపడుతున్నారట. అయితే నవీన్ నూలి గతంలో సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’లాంటి హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేశారు.
Image result for nikhil movie arjun suravaram
అలాంటిది దర్శకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చిత్ర యూనిట్ ఆలోచనలో పడ్డట్టు సమాచారం. ఈ  సినిమాలో నిఖిల్‌ అర్జున్‌ లెనిన్‌ సురవరం అనే జర్నలిస్ట్‌ పాత్రలో నటించారు.   సమాజంలోని సమస్యల్ని మీడియా ఎలా పరిష్కరిస్తుందో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నిఖిల్‌ ఇందులో అర్జున్‌ సురవరం అనే ఓ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు. 
Image result for nikhil lavanya tripati
నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సంతోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఔరా సినిమాస్‌, మూవీ డైనమిక్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ఠాగూర్‌’ మధు సమర్పిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్‌ అరోరా, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సూర్య, సంగీతం: స్యామ్‌ సి.ఎస్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: