తెలుగు ఇండస్ట్రీలో  సంప్రదాయ బద్ధమైన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది లయ.  తెలుగు లో పలు హిట్ చిత్రాల్లో నటించిన లయ మంచి ఫామ్ లో ఉండగానే వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయింది.  అప్పటి నుంచి మూవీస్ కి దూరంగానే ఉంటూ వస్తుంది.  ఆ మద్య లయ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  ఆ మద్య తెలుగు లో ఎలాంటి కమిట్ మెంట్ లేవని చెప్పింది లయ.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తెలుగు ప్రేక్షకులు నా పట్ల చూపిన ఆదరాభిమానాలను నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను' అని అంది.
Image result for actress laya
వివాహం తర్వాత తాను మూవీస్ మానివేయమని తన భర్త ఏమీ చెప్పలేదని..నా వ్యక్తిగత స్వేచ్చా విషయంలో ఆయన ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు.  పిల్లలను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతోనే తాను చిత్రాల్లో నటించడం లేదని అన్నారు.  అయితే తనకు ఇంకా వదిన, అక్క, అమ్మ పాత్రల్లో నటించే వయసు రాలేదని అలాంటి పాత్రలు వచ్చినా తాను చేయబోనని అన్నారు.   
Image result for actress laya
నా వయసుకి తగిన పాత్రలు వస్తే చేయడానికి నేను సిద్ధంగానే వున్నాను. 'అరవింద సమేత'లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అడిగారు. నా వయసుకి మించిన పాత్ర కావడం వల్లనే చేయలేదు" అని చెప్పుకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: