సీనియర్ నటి రమాప్రభ ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఆమె అందరి దృష్టిలో పడటానికి ఇలా కొన్ని సంచలనాలు ఈమె చేస్తోంది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో రామ్ గోపాల్ వర్మ రమాప్రభ విషయంలో చేసిన ట్విట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. 

వర్మ తీస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు చాలామందికి తెలియని ఎన్ఠీఆర్ డార్క్ సీక్రెట్స్ ను రమాప్రభ తనకు తెలియచేసింది అంటూ వర్మ ట్విట్ చేయడమే కాకండా ఆమెతో కలిసి తీయించుకున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అంతేకాదు రమాప్రభ 'బ్యూటిఫుల్ లేడీ' అంటూ ఆమెను ప్రశంసిస్తూ దాసరి నారాయణరావు తరువాత ఇండస్ట్రీలో తాను ఎక్కువగా గౌరవం ఇచ్చేది రమాప్రభకు మాత్రమే అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. 

దీనితో రమాప్రభ వర్మకు ఎన్టీఆర్ కు సంబంధించి ఎవరికీ తెలియని డార్క్ సీక్రెట్స్ ఏమి చెప్పి ఉంటుంది అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన సంఘటలను యథా తదంగా తీస్తున్న వర్మ ఇప్పుడు రమాప్రభ చెప్పిన డార్క్ సీక్రెట్స్ ను కూడ తీస్తే 'లక్ష్మీస్ ఎన్టీఆర్; ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అన్న అంచనాలు కూడ అందడం లేదు. 

అయితే ఈ విషయాలను పరిశీలిస్తున్న ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఇది అంతా వర్మ తన సినిమాకు పబ్లిసిటీ పెంచుకోవడం కోసం రమాప్రభను అడ్డంపెట్టుకుంని. అనుసరిస్తున్న వ్యూహాలు మాత్రమే అంటూ మరొక ట్విస్ట్ ఇస్తున్నారు. డబ్బు ఖర్చు లేకుండా తన సినిమాలకు క్రేజ్ పెంచుకోవడంలో సమర్ధుడైన వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో ఇంకా ఎన్ని ట్రిక్స్ చేస్తాడో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: