టాలీవుడ్లో ఏడాదికి వందకు పైగా సినిమాలు వస్తాయి. అందులో స్టార్ హీరోల మూవీస్ తీసుకుంటే కచ్చితంగా ఇరవై  వరకూ ఉంటాయి. అలాగే మిడిల్ ఏజ్ హీరోల మూవీస్ తీసుకున్నా ఓ ఇరవై ఉంటాయి. మరి ఇన్ని సినిమాలు నిర్మాణం అవుతూంటే అందులో ఎంతమంది హీరోయిన్లు అవసరం అవుతారో చూసుకుంటే టాలీవుడ్ కి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలిసిపోతుంది.


టాలీవుడ్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. సిక్స్టీ ప్లస్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ ఉన్నారు. వీరందరికీ హీరోయిన్లు దొరకాలి. స్టార్ హీరోయిన్ ఉంటేనే తప్ప మూవీ చేయని హీరోలు ఓ వైపు ఉన్నారు. కాస్త పేరు తెచ్చుకున్న హీరోయిన్ల కోసం కూడ చూస్తున్నారు. ఈ పరిస్తితుల్లో సిక్స్టీ ప్లస్ హీరోలకు అసలు  హీరోయిన్లు దొర‌కడంలేదు. ఎంతసేపు శ్రీయ, నయనతార, అనుష్క పేర్లే వినిపిస్తున్నాయి. దీంతో ఇపుడు కొంత మంది యంగ్ హీరోయిన్లు తెలివిగా ఈ డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. దాంతో తమకు ఆఫర్లు దక్కుతాయి. లక్ బాగుండి మూవీ హిట్ అయితే చాన్సులు కూడా పెరుగుతాయని భావిస్తున్నారట.


ఆ వరసలో రకుల్ ప్రీత్ సింగ్ ముందుంటే ఇపుడు ఆరెక్స్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చేరింది. రకుల్ తనకు టాలీవుడ్లో చాన్సులు తగ్గడంతో సీనియర్లకు సై అంటోంది. ఇపుడు ఆరెక్స్ భామ కూడా సీనియర్ల పక్కన జోడీ కట్టేందుకు రెడీ అంటోంది. పాయల్ ఒకేమారు ఇద్దరు సీనియర్ల సినిమాలకు సైన్ చేసినట్లుగా తాజా టాక్. నాగార్జునతో మన్మధుడు 2 మూవీ, అలాగే వెంకటేష్ తో వెంకీ మామ సినిమాలకు పాయల్ ఒకే అనేసిందట. ఈ భామకు ఆరెక్స్ మూవీ హిట్ అయినా ఆఫర్లు అంతగా రావడం లేదు. దాంతో సీనియర్లతో సాంగేసుకోవడానికి రెడీ అయిపోతోంది. మరి ఆ విధంగా మరికొంత మంది యంగ్ హీరోయిన్లు కూడా చూస్తున్నారుట. అంటే మన సీనియర్ హీరోల పంట పండిందన్న మాటేగా మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: