బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే వెంటనే చెబుతారు కండల వీరుడు సల్మాన్ ఖాన్.  ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తే వచ్చే యేడాది ఖచ్చితంగా చెసుకుంటా అంటూ మాటలు చెబుతూ వస్తున్నాడు సల్మాన్‌ఖాన్‌.  పాలిటిక్స్ లో రాహూల్ గాంధీ.. సినిమాల్లో సల్మాన్‌ఖాన్ పెళ్లి విషయంలో జరిగినంత చర్చ ఎవరిపైనా జరగలేదు.  తాజాగా సల్మాన్ ఖాన్ అభిమాని..చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.   బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ని పెళ్లిచేసుకోండి అంటూ ఓ అభిమాని స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని రిక్వెస్ట్ చేశాడు. 
Salman Khan and Katrina Kaif
గతంలో వీరిద్దరూ కలిసి డేటింగ్ చేశారని, పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా కత్రినా ఓ కార్యక్రమానికి హాజరైంది.  ఆ కార్యక్రమానికి వచ్చిన ఓ వ్యక్తి సల్మాన్, కత్రినా జంటగా నటిస్తోన్న 'భారత్' సినిమా పోస్టర్ పట్టుకొని దానిపై 'ప్లీజ్ మేడం.. సల్మాన్ మీకు పర్ఫెక్ట్. ఆయన్ని పెళ్లి చేసుకోండి' అని రాశారు. దాంతో అతనికి సమాదానంగా 'హుమ్ Hmm.. నీ ప్రశ్నకి ఇదే నా రియాక్షన్' అంటూ సమాధానమిచ్చింది.  అంతేకాదు తన పెళ్లిపై ఇంకాస్త ఓపెన్ అయింది. నాకు నిజంగా తెలియదు.
Image result for katrina kaif salman
పెళ్లి అంటే ఇద్దరికి సంబంధించిన విషయం. ఇద్దరి మనసులు కలవాలి. అలాంటి వ్యక్తి కలిస్తే అప్పుడు చేసుకుంటా అని కత్రినా చెప్పడం విశేషం. బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కొత్తలో కత్రినా,సల్మాన్ ఖాన్ దేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 2009లో వీళ్లు విడిపోయారు.  ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి ఉన్నారు..కాకపోతే మా ఇద్దరి మధ్య మంచి స్నేహమే కొనసాగుతున్నది. ఒకరినొకరు ఫ్యామిలీగా చెప్పుకుంటారు. ఈ మధ్యే టైగర్ జిందా హైలో కలిసి నటించారు. ప్రస్తుతం భారత్ మూవీ కోసం జత కట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: