ఈ మద్య బాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా తమ సత్తా చాటుతూ వస్తున్నారు.  ఈ నేపథ్యంలో రణధీర్ కపూర్ కూతుళ్లు కరీష్మా కపూర్, కరీనా కపూర్ లు హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చారు. అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్, శత్రుఘ్హ సిన్హా కూతురు సాక్షి సిన్హా, విలన్ కమెడిన్ అయిన శక్తి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ లు హీరోయిన్లు గా రాణిస్తున్నారు.  ఇటీవల అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కూపూర్, సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 

ఈ లీస్టు లో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూతురు కూడా ఉన్నట్లు సమాచారం.  త్వరలో బాలీవుడ్ లోకి ఎంట్రి ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ మద్య వార్తలు కూడా వచ్చాయి. తాజాగా  ఇప్పటికే సుహానా సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు ఎంతో మంది ఫాలోయర్లు ఉన్నారు.
Image result for suhana khan
తాజాగా సుహానాకు ఓ ప్రశ్న ఎదురైంది.  ఒకవేళ డేటింగ్ చేయాలనుకుంటే మీరు ఎవరితో డేటింగ్ చేస్తారు? అని ఓ అభిమాని ఆమెను ప్రశ్నించాడు.  ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. దక్షిణ కొరియా సింగర్, యాక్టర్ సుహోతో డేటింగ్ చేయాలనుకుంటున్నా' అని తెలిపింది. అంతే కాదు సుహో ఫొటోను కూడా షేర్ చేసింది. సుహో అసలు పేరు కిమ్ జున్ మియాన్. 



మరింత సమాచారం తెలుసుకోండి: