దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇటీవల బాగా సైలంటైపోయాడు. తన కొత్త సినిమా గురించి ఎలాంటి క్లూస్ ఇవ్వడం లేదు. కామ్ గా తన పని తాను కానిచ్చేసుకుపోతున్నాడు. సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్నా ఒకటీ అరా తప్ప పెద్దగా లీకులు ఉండటం లేదు.


ఈ సైలన్స్ కారణంగా తన కొత్త సినిమా ఆర్ఆర్ ఆర్ పై ఇంకా క్రేజ్ పెరుగుతోంది. అందులోనూ ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు పెద్ద నటులు కలసి చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి మొదటిసారి రాజమౌళి నోరువిప్పాడు.



ఇటీవల రాజమౌళి హార్వార్డ్ కెన్నడీ స్కూల్ లో జరిగిన ఓ కార్యాక్రమానికి హాజరయ్యాడు. అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లతో చేస్తున్న #RRR  ఒక ప్యాన్ ఇండియన్ ఫిలిమేనా? అని అడిగితే .. ఔనంటూ సమాధానం ఇచ్చాడు. అందుకు కారణం ఈ సినిమా కథే అంటున్నాడు రాజమౌళి.



అంతే కాదు.. ఈ సినిమా కూడా బాహుబలి రేంజ్‌లో ఉన్న లార్జ్ స్కేల్ మూవీయే అని తేల్చి చెప్పేశాడు. ఇంతకూ కథ ఏంటి.. ఫ్యాంటసీనా, పిరీయాడికలా అని అడిగితే మాత్రం.. నవ్వుతూ విషయం దాటవేశాడు. మరీ మరీ అడిగితే.. అలాంటి ప్రశ్నలు అడగొద్దు అంటూ నవ్వులతో సరిపెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: