‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల తేదీ ఫిక్స్ కాకుండానే రామ్ గోపాల్ వర్మ ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంలో నిన్న సాయంత్రం వర్మ లక్ష్మి పార్వతితో కలిసి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బాలకృష్ణ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
Ram Gopal Varma
‘కథానాయకుడు’ ‘మహానాయకుడు’ సినిమాలకు మూడవ భాగంగా తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఉంటుందని తన సినిమాతో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి చూపించడానికి ఇక ఏవిషయాలు ఉండవనీ అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఈమధ్య తన శరీరంలోకి సత్యహరిశ్చంద్రుడు ఆత్మ పరకాయ ప్రవేశం చేయడంతో తనకు నిజాలనుచెప్పే వింత వ్యాధి సోకిందని ఈ వ్యాధికి తాను వైద్యం చేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు వర్మ. 
బాలకృష్ణ మొదలు పెట్టాడు.. వర్మ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు..
ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న న్యూస్ ప్రజంటర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు సంబంధించి బాలకృష్ణ వైపు నుంచి ఏమైనా సమస్యలు వస్తాయని భావిస్తున్నారా అంటూ అడిగిన ప్రశ్నకు వర్మ ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చాడు. తన దృష్టిలో బాలకృష్ణ చాల తెలివైన వ్యక్తి అని అంటూ ఎన్టీఆర్ తనకు మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు కోట్లాది మంది తెలుగు ప్రజలకు దగ్గరైన వ్యక్తి అన్న విషయం తనకన్నా బాలయ్యకు బాగా తెలుసు అనీ అందువల్ల ఎంతో విచక్షణ గల బాలకృష్ణ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు సమస్యలు సృష్టిస్తాడని తాను భావించడం లేదు అంటూ బాలయ్యకు అనుకూలంగా మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇదే సందర్భంలో ఈసినిమాలోని తాను తీసిన సన్నివేశాల గురించి మాట్లాడుతూ ఎంతటి ప్రముఖ వ్యక్తికి అయినా అతడికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది కాబట్టి ఆ విషయాల గురించి కేవలం తాను లక్ష్మీ పార్వతి చెప్పిన విషయాలనే ఆధారంగా తీసుకోకుండా ఎంతోమంది దగ్గర నుండి ఎన్టీఆర్ చివరి దశలోని వ్యక్తిగత జీవితానికి సంబంధించి తాను సమాచారాలు రాబట్టాను అంటున్నాడు వర్మ. ఈమూవీ మార్చి రెండవ వారంలో విడుదల అవుతుంది అని వర్మ ఇస్తున్న లీకులను బట్టి ఈమూవీలోని సంచలన విషయాలు ఎంతోకొంత రాబోతున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్ర వహిస్తుంది అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: