మాలీవుడ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిన విషయం తెలిసిందే. ఒరు అదార్ ల‌వ్ చిత్రంలో  ఓ సాంగ్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియా మొత్తం ప్రియా ప్రకాశ్‌కు ఫిదా అయిపోయింది. దీంతో సినిమాపై కూడా అంచనాలు భారీగానే పెరిగాయి.  దాంతో ఈ చిత్రాన్ని తెలుగు తో కూడా రిలీజ్ చేశారు. నటిగా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కు సినిమా విడుదలకు ముందే పాప్యులారిటీని తెచ్చి పెట్టిన 'ఒరు అడార్‌ లవ్‌' డబ్బింగ్ వర్షన్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

నటిగా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కు చిత్రం విడుదలకు ముందే పాప్యులారిటీని తెచ్చి పెట్టిన 'ఒరు అడార్‌ లవ్‌' డబ్బింగ్ వర్షన్ గా వచ్చిన ‘లవర్స్ డే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం..ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న చిత్రం విడుదల కాగా, కలెక్షన్ల విషయంలో ఘోరంగా దెబ్బతిన్నది. అందుకు కారణం చిత్రంలోని క్లైమాక్స్‌ ప్రేక్షకులను నిరాశకు గురిచేసిందని కామెంట్లు రావడంతో, 10 నిమిషాల కొత్త క్లైమాక్స్ ను చిత్రీకరించామని, బుధవారం నుంచి ప్రేక్షకులు కొత్త క్లైమాక్స్ ను చూడవచ్చని దర్శకుడు ఒమర్ తెలిపారు.
Related image
రియలిస్టిక్ గా చిత్రాన్ని చూపించాలన్న ఉద్దేశంతోనే క్లైమాక్స్ లో ట్రాజడీని చూపించామని, అయితే, ప్రేక్షకులు నిరాశ చెందడంతో, నిర్మాతలతో చర్చించి ముగింపును మార్చామని అన్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు నూరిన్ షెరీఫ్, రోషన్ అబ్దుల్ రహూఫీ ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: