విజయానికి అందరూ వారసులే. అదే అపజయానికి మాత్రం ఎవరూ వకాల్తా పుచ్చుకోరు. అది పూర్తిగా అనాధ అవుతుంది. మరీ ముఖ్యమంగా సెంటిమెంట్ ని నమ్ముకుని కధ నడిపే టాలీవుడ్లో అదే జరుగుతోంది. ఒక మూవీ హిట్ అయితే వచ్చే జోషే వేరబ్బా. అసలు ఆ కిక్కే గొప్పది. మరి అదే ఫ్లాప్ అయితే మాత్రం ఎంతటి గ్రేట్ డైరెక్టర్ అయినా పక్కన పడేస్తారు. ఇది చాలాకాలంగా జరుగుతోంది. ఇపుడు కూడా కొనసాగుతోంది.


విషయానికి వస్తే అన్న గారి జీవితాన్ని బయోపిక్ అంటూ హడావుడి చేయడమే తప్పు. దాన్ని పోనీ అన్నీ సవ్యంగా చూపే దమ్ము ఉందా అంటే అదీ లేదు. ఈ రకమైన చిత్ర విచిత్ర విన్యాసాలతో వచ్చిన కధానాయకుడు సంక్రాంతి వేళ డిజాస్టర్ అయింది. దానికి సీక్వెల్ గా మహా నాయకుడు వస్తోంది. నిజానికి ఓ మూవీ హిట్ అయితే సీక్వెల్ ఉంటుంది. ఫ్లాప్ మూవీని కంటిన్యూ చేయడం అంటే భారీ రిస్క్ ని ఫేస్ చేయాల్సిందే. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికో కానీ రాదు. ముందే చెప్పారు కనుక మహానాయకుడుని తప్పనిసరిగా రిలీజ్ చేయాలి. దాంతో ఈ చిత్ర యూనిట్ మొక్కుబడిగా రిలీజ్ అంటున్నట్లే కనిపిస్తోంది.


ఈ చిత్ర దర్శకుడు క్రిష్ ఇపుడు పూర్తి మౌన వ్రతం పాటిస్తున్నారు. ఆయన మహానాయకుడు మూవీ గురించి అసలు పట్టించుకోవడం లేదని ఇన్సైడ్ టాక్. బాలయ్యతో వచ్చిన విభేదాలే ఆయన మౌనానికి కారణమని అంటున్నారు. ఇక చిత్ర కధానాయకుడు, నిర్మాత, అన్నింటికీ మించి అన్న గారి కుమారుడు అయిన బాలయ్య సైతం ప్రమోషన్ చేయడంలేదు. మూవీ తీసాం, రిలీజ్ చేశాం అన్న తీరులో ఉంది ఫిల్మ్ మేకర్ల వ్యవహారం. మరి అసలే మొదటి భాగం ఫ్లాప్ అయిన టైంలో బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పైగా ప్రమోషన్ టాప్ గేర్లో ఉంటేనే పాజిటివ్ బజ్ వస్తుంది. మరి ఏదీ కాకుండా వదిలేస్తున్న మహానాయకుడు మహర్జాతకం ఏంటన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: