నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా దర్శకుడిగా తన స్థాయిని ప్రూవ్ చేసుకున్న అవసరాల శ్రీనివాస్ కొంతకాలంగా వార్తలకు దూరంగా ఉంటున్నాడు.  ‘జ్యో అచ్యుతానంద’ తర్వాత మళ్లీ దర్శకుడిగా ఇతడు మరో సినిమా చేయలేదు. నటుడిగా సినిమాల గురించి ఇతడు పెద్దగా ప్రయత్నాలు చేయ పోవడంతో  పెరిగి పోయిన పోటీలో అవసరాల వెనుక పెడ్డాడా అన్న సందేహాలు ఏర్పడ్డాయి.  
 I'm Ready To Pen Stories For Others: Avasarala
ఇలాంటి  సమయంలో అవసరాల మళ్లీ వార్తలలలోకి వచ్చాడు. అవసరాల హీరోగా ‘ఎన్ఆర్ఐ నాయనా రారా ఇంటికి’ అనే సినిమాకు రంగం సిద్ధం అయింది.  శ్రీనివాస్ పూర్తి స్థాయిలో కథానాయకుడిగా నటిస్తున్నఈ మూవీని బాల రాజశేఖర్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. పేరుకు  ప్రదీప్ అనే కొత్త నిర్మాత ఈ సినిమాను తీస్తున్న ఈ సినిమా వ్యవహారాలు నడిపిస్తున్నది తెర వెనుక అవసరాల అనే వార్తలు వస్తున్నాయి.  
  Srinivas Avasarala, Srinivas Avasarala Story Aamir Khan, Srinivas Avasarala Script Aamir Khan, Srinivas Avasarala Script Aamir Khan Movie, Srinivas Avasarala Story Aamir Khan Movie, Director Srinivas Avasarala Script Aamir Khan
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. చదువు, ఉద్యోగం పేరుతో అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలైపోయి మళ్లీ సొంత ఊరి వైపు చూడని కుర్రాడి కథతో తెరకెక్కుతున్న సినిమా ఇది అని తెలుస్తోంది. ఈ మధ్య అమెరికాలో తెలుగు విద్యార్థులకు ఎదురైనా చేదు సంఘటనలు ఈ మూవీలో యధా తధంగా చూపెడతారని  అంటున్నారు.  
Srinivas Avasarala turns Scientist for Varun Tej’s space film
వాస్తవానికి అవసరాల  శ్రీనివాస్  ఒక ఎన్నారై. సినిమాల పై మోజుతో అమెరికా నుండి ఇండస్ట్రీకి వచ్చాడు. ఈ సినిమా అంతా సెటైర్లతో   నేటి తరానికి అమెరికా పై ఉన్న మోజు నేపధ్యంలో ఉంటుంది అని తెలుస్తోంది.  ఈ సినిమాలో  అమెరికా రిటర్న్అయి తెలుగులో సినిమాలు చేస్తున్న  మంచు లక్ష్మీ ప్రసన్నకూడా కీల పాత్ర పోషిస్తున్నట్లు టాక్. దీనితో అవసరాల మంచు కాంబినేషన్ ఈ మూవీ స్థాయిని పెంచి తనకు మంచి పేరు తెచ్చి పెడుతుంది అని అవసరాల ఆశిస్తున్నాడు. 'జ్యో అచ్యుతానంద’ తరువాత అవసరా హీరో గా నటించిన మూవీ ఏది రాకపోవడంతో  ఈ సినిమాతో తిరిగి తనకు మంచి బ్రేక్ వస్తుందని కలలు కంటున్న అవసరాల  అవసారాల ప్రయత్నం ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: