కళా తపస్వి  కే విశ్వనాధ్ పుట్టిన రోజు ఈ రోజు. ఆయన భగవంతుని ఆశీర్వాదాలు, తెలుగు ప్రేక్షకుల అభిమానంతో 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ పడిలోకి  అడుగు పెట్టారు. విశ్వనాధ్ అంటే సంగీతం, నాట్యం వంటి లలిత కళలతో సినిమాలు తీసిన దర్శకుడు గుర్తుకు వస్తారు. కానీ విశ్వనాధ్ అన్ని రకాలైన  సినిమాలు కూడా తీశారు. ఆయనలో ఓ విప్లవ దర్శకుడు కూడా ఉన్నారు.


కాలం మారింది అన్న సినిమా 1970 దశకం మొదట్లో వచ్చింది. అంటే ఇప్పటికి సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం అన్న మాట. నాడు సంప్రదాయాలు కట్టుబాట్లు చాలా ఎక్కువే. మరి వాటిని ఎదిరిస్తూ విశ్వనాధ్ కాలం మారింది సినిమా తీశారు. అది సూపర్ హిట్ ఆ రోజుల్లో. ఇక ఓ ఆకతాయికి బుద్ధి చెప్పే కధాంశంతో ఓ సీత కధ తీసి మహిళా పక్షపాతి అనిపించుకున్నారు. మూగ అమ్మాయి నాట్యకారిణిగా పెట్టి సిరిసిరి మువ్వ తీస్తే బంపర్ హిట్. సనాతనమ బ్రాహ్మణ యువతిని ఓ దళితుని ప్రేమకు మెచ్చి ఇచ్చి  వివాహం జరిపించే కధాంశంతో సప్తపది తీసింది కూడా విశ్వనాధే.


ఇవన్నీ ఇలా ఉంటే కాలాంతకులు  అంటూ ఓ యాక్షవ్ మూవీని కూడా విశ్వనాధ్ తీసారు. అలాగే అల్లుడు పట్టిన భరతం అనే మరో మాస్ మూవీని ఆయనే తీశారు. ఇక పల్లెటూరిలో ఉండే రాజకీయాల మీద ప్రెసిడెంట్ పేరమ్మ మూవీని తీసింది విశ్వనాధ్ అంటే నమ్మలేం. వీటన్నిటినీ మించి ఆయన తీసిన శంకరాభరణం మూవీకి మంచి పేరు రావడంతో విశ్వానాధ్ కి ఆ బ్రాండ్ వేసేశారు. 


ఇక ఆయన సాగర సంగమం మూవీ కధ ఓ రైలు  ప్రయాణంలో పుట్టిందంటే ఆశ్చర్యం వేస్తుంది. జీవితంలో ఎపుడూ వేదిక ఎక్కని ఓ నాట్య  కళాకారుని జీవితం అన్న చిన్న కధను ఆధారంగా చేసుకుని ఆయన కమల్ తో ఆ మూవీ తీసి గొప్ప పేరు సంపాదించారు. విశ్వనాధ్ కధలన్నీ చిన్న సంఘటలన నుంచి పుడతాయట. ఆ మాట ఆయనే చెప్పారు ఎన్నో సార్లు  మీడియా ఇంటర్వ్యూలలో


మరింత సమాచారం తెలుసుకోండి: