తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ లాంటి ఓ మహా నటుడు స్థాపించిన పార్టీ. ఆ తర్వాత కూడా ఆ పార్టీ ఎందరో నటులకు రాజకీయ జీవితం ప్రసాదించింది. రావుగోపాలరావు, మోహన్ బాబు, శారద, కైకాల సత్యనారాయణ వంటి ఎందరో టీడీపీ తరపున ఎంపీలుగా సేవలందించారు.


సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తే మొదటి ఆప్షన్ గా టీడీపీ ఉండేది. నటులంతా టీడీపీ వైపే క్యూ కట్టేవారు. కానీ కొన్నాళ్లుగా సీన్ మారిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత టాలీవుడ్ పై టీడీపీ ప్రభావం చాలావరకూ తగ్గిపోయింది. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడం ఇందుకు ప్రధాన కారణం.

tdp tollywood కోసం చిత్ర ఫలితం

సినీ నటులు బాబుకు దూరం కావడానికి కేసీఆర్ సానుకూల ధోరణి కూడా ఓ కారణమే. రాష్ట్రవిభజన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటంతో సినీనటులంతా కేసీఆర్, కేటీఆర్ లతో సఖ్యతగానే ఉంటున్నారు. దీంతో టాలీవుడ్ దాదాపుగా చంద్రబాబును మరిచిపోయింది.



ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో అంతా జగన్ వైపు వెళ్తున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి నేరుగా జగన్ తో దగ్గరి బంధుత్వం ఉంది. హీరో నాగార్జున నేరుగా వెళ్లి జగన్ ను కలిసి పాదయాత్రపై అభినందించి వచ్చారు. ప్రమఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే వైకాపా ఎమ్మెల్యేతో బంధుత్వం కలుపుకున్నారు. ఇప్పటికే వైకాపా తరపున పృథ్వీ, పోసాని వైకాపా తరపున గట్టిగా గొంతు వినిపిస్తున్నారు. ఇక టీడీపీకి దివ్యవాణి వంటి వారే దిక్కేమో..


మరింత సమాచారం తెలుసుకోండి: