టాలీవుడ్ లో నూతన దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో యూత్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’మంచి విజయం అందుకుంది.  ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఈ సినిమాలో బోల్డ్ కాన్సెప్ట్ ఉన్నా..యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో భారీగా కలెక్షన్లు సాధించింది.  ఈ సినిమా ఇతర భాషల్లో రిమేక్ చేస్తున్నారు.  బాలీవుడ్ లో సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.  తమిళ వర్షన్ లో బాల దర్శకత్వంలో ‘వర్మ’గా విక్రమ్ కుమార్ తనయుడు ధృవ్ తో తీశారు. 
Image result for arjun reddy tamil remake aditya varma
కానీ ఈ సినిమా ఔట్ పుట్ సరిగా లేదని నిర్మాతలు సినిమా ఆపివేశారు. అంతే కాదు కొత్త దర్శకుడితో ఈ సినిమాను మళ్లీ మొదలు పెట్టారు. ఇక సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ రీమేక్‌కి ద‌ర్శ‌కుడిగా ప‌ని చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ధృవ్ లుక్ కూడా విడుద‌ల చేశారు.
Image result for arjun reddy tamil remake aditya varma
ధృవ్ విక్ర‌మ్‌ సరసన  అక్టోబ‌ర్ చిత్ర ఫేం బానిటా సందుని ఎంపిక చేశారు.  కొత్త టీంతో కంటిన్యూగా వర్క్ ఔట్ చేసి ఈ సినిమా 2019, జూన్‌లో విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ తెలిపిన విష‌యం విదిత‌మే. ఒరిజిన‌ల్ వ‌ర్షెన్‌కి సంగీతం అందించిన ర‌ధ‌న్ ఆదిత్య వ‌ర్మ సినిమాకి సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా ర‌వి కె చంద్రన్ ప‌ని చేయ‌నున్నారు. రవి కె చంద్రన్ తనయుడు సంతన కృష్ణన్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌కి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: