టాలీవుడ్ లోకి అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని  కెరీర్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు.  వాస్తవానికి డైరెక్షన్ పై మక్కువతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన నాని ప్రముఖ దర్శకులు బాబు వద్ద కొంత కాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు.   ఇంద్రగంటి మోహనకృష్ణ ‘అష్టాచమ్మా’సినిమాలో హీరోగా ఛాన్స్ రావడంతో యూటర్న్ తీసుకున్నాడు.  మారుతి డైరెక్షన్ లో భలే భలే మగాడివోయ్ సినిమాతో మతిమరుపు పాత్రలో నాని చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. 
Related image
ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని వరుసగా ఆరు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నాని .. 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, తదుపరి సినిమా కోసం విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు.  ఈ సినిమాలో మూడు రకాల పాత్రలు పోషిస్తున్నాడని సమాచారం.
Image result for nani vikram kumar
ఈ నేపథ్యంలోనే నాని .. ఇంద్రగంటి మోహనకృష్ణకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'అష్టా చమ్మా' ... 'జెంటిల్ మేన్' సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇంద్రగంటి కథ చెప్పగానే నాని ఓకే అనేశాడట. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.  అంతే కాదు ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో సుదీర్ బాబు నటించబోతున్నట్లు సమాచారం. ఇది నానికి 25వ సినిమా కావడంతో సంఖ్యా పరంగా కలిసి వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: