సినిమా రంగంలో అదే విధంగా రాజకీయాలలో ఏదైనా ఒక చిన్న విషయం  లీక్ అయితే ఆ విషయం పై రకరకాల కోణాలలో ఆలోచిస్తూ మీడియా ఊహా గానాలు రాయడం సర్వ సాధారణంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో అడివి శేషు సుప్రియల స్నేహాన్ని మరొక కోణంలో చూపెడుతూ ఆ విషయాన్ని అందరికి తెలిసే విధంగా గాసిప్పులు హడావిడి చేయడం వెనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలకంగా పని చేశాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. 
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
అంతేకాదు వీరిద్దరి స్నేహానికి రాజకీయ రంగు పులమడంతో షాక్ అయినా నాగార్జున తన వ్యూహాలు మార్చి నిన్న హడావిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ను కలిసాడు అని వార్తలు గుప్పు మంటున్నాయి. వాస్తవానికి అడివిశేషు సుప్రియల స్నేహం గురించి ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మందికి తెలిసిన ఆ విషయాలకు ఎవరు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవ లేదని కానీ ఏపీ ఎన్నికల వేడి రగులు కుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికార వర్గానికి అనుకూలమైన మీడియాలో అడివి శేషు, సుప్రియ గురించి వార్త పతాక శీర్షికల్లో ప్రచురించడం నాగార్జునకు తీవ్ర అసహనం కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి   
 à°¨à°¾à°—ార్జునను కూడా అదే కోణంలో
దీనికితోడు నాగార్జున జగన్ మోహన్రెడ్డిని కలవబోతున్నాడు అంటూ ఆ ప్రముఖ పత్రిక తన కధనంలో ముందుగానే పేర్కొనడం ఇలా ఈ  విషయాలు అన్ని వ్యూహాత్మకంగా నాగార్జునను కార్నర్ చేయడానికే అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో వివాదాలకు అదేవిధంగా రాజకీయాలకు దూరంగా ఉండే నాగార్జున పై కొన్ని ప్రముఖ మీడియా వర్గాలు ఎందుకు గుర్రు గా ఉన్నాయి అన్న విషయం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న గా మారింది. 

ఇది ఇలా ఉంటే నాగార్జున తాను జగన్ ను కలిసిన విషయం పై క్లారిటీ ఇస్తూ తమ కలయిక వెనుక రాజకీయాలు లేవని చెపుతున్నా మరికొద్ది గంటలలో జగన్ లండన్ లో వెళ్ళిపోయే హడావిడిలో ఉండి కూడ సుమారు 40 నిముషాలు వీరిద్దరూ ఏకాంతంగా ఏమి మాట్లాడుకున్నారు అన్న విషయమై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే బాలకృష్ణ క్రియాశీల రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో నాగార్జున తెరవెనుక రాజకీయాలు నడిపితే మళ్ళీ నందమూరి అక్కినేని కుటుంబాల మధ్య రగడ ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: