డబ్బు అంటే ఎవరికి ఛేదు..డబ్బు కోసం ఏ పనికైనా సిద్ద పడుతున్నారు కొందరు.  ఇందులో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అనే తేడా లేకుండా డబ్బు కు లోకం దాసోహం అంటున్నారు.  ప్రస్తుతం 2019 లోక్ సభ ఎన్నికల్లో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు తమ సామాజిక మీడియా ఖాతాలపై అనుకూలమైన సందేశాలను పోస్ట్ చేయడం ద్వారా డబ్బు కోసం రాజకీయ పార్టీని ప్రోత్సహించడానికి 36 బాలీవుడ్ ప్రముఖులు సిద్ధమయ్యారని ప్రముఖ పరిశోధనాత్మక వెబ్ సైట్ కోబ్రాపోస్ట్ బాలీవుడ్ మరో చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. 

Image result for కోబ్రాపోస్ట్
ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లలో సన్నీ లియోన్, అమీషా పటేల్, మహిమా చౌదరి, రాఖీ సావంత్, ఏవ్లీన్ శర్మ, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్, టిస్కా చోప్రా, శక్తి కపూర్, సోనూ సూద్, శ్రేయాస్ తల్పాడే, పునీత్ ఇస్సార్, సురేంద్ర పాల్, పంకజ్ ధీర్, అతని కొడుకు నికితన్ ధీర్ ఉన్నారు. వీరు మాత్రమే కాదు  వీళ్లు కాకుండా దీప్ శిఖా నాగ్ పాల్, అఖిలేంద్ర మిశ్రా, రోహిత్ రాయ్, రాహుల్ భట్, సలీమ్ జైదీ, అమన్ వర్మ, హితేన్ తేజ్వానీ, అతని భార్య గౌరీ ప్రధాన్, మినీషా లాంబా, కోయినా మిత్రా కూడా ఈ ఆఫర్ కి అంగీకరించారు.
Image result for కోబ్రాపోస్ట్
‘కోబ్రాపోస్ట్’ అనే ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో వీరు దొరికిపోయారు. ఇక గాయకుల విషయానికి వస్తే  పూనమ్ పాండే, అభిజిత్ భట్టాచార్య, కైలాష్ ఖేర్, మీకా సింగ్, బాబా సెహగల్ అంగీకరించిన వారిలో ఉన్నారు. రాజూ శ్రీవాస్తవ్, సునీల్ పాల్, రాజ్ పాల్ యాదవ్, ఉపాసనా సింగ్, కృష్ణ అభిషేక్, విజయ్ ఈశ్వర్ లాల్ పవార్ వంటి ప్రసిద్ధ హాస్య కళాకారులు అడిగినంత డబ్బులు ముట్టజెప్తే తాము రాజకీయ పార్టీలకు తమ వంతు సాయం చేస్తామని కెమెరా సాక్షిగా చెబుతూ దొరికిపోయారు కోబ్రాపోస్ట్ విలేఖరులు ప్రజాసంబంధాల ప్రతినిధులమని చెప్పుకుంటూ.. సినీ, టీవీ నటులు, గాయకులు తదితరులను వారి మేనేజర్ల ద్వారా సంప్రదించారు.
Image result for కోబ్రాపోస్ట్
అత్యాచారం, వంతెనలు కూలడం వంటి వివాదాస్పద అంశాల్లో వీరు ప్రభుత్వాన్ని సమర్థించడానికి అంగీకరించారు. ఈ ప్రచారాన్ని కప్పి పుచ్చడానికి ఏదో ఉత్పత్తులకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు ఒక డమ్మీ కాంట్రాక్టుపై సంతకం చేయడానికి కూడా వారు సిద్ధపడ్డారు  అని కోబ్రాపోస్ట్‌ ముఖ్య సంపాదకుడు అనిరుద్ధ బహల్‌ చెప్పారు.   విద్యాబాలన్, సౌమ్య టాండన్, అర్షద్ వార్సి, రజా మురాద్ మాత్రం ఈ ఒప్పందానికి ససేమిరా ఒప్పుకోలేదని బహల్ తెలిపారు. తాము డిమాండ్ చేసిన డబ్బు ఒక్కో పోస్ట్‌కు రూ.2 లక్షల నుంచి 50 లక్షల వరకు అడిగినట్లు సమాచారం.
bollywood_celebs
ఇక  8 నెలల కాంట్రాక్ట్ కోసం రూ.20 కోట్లు అడిగిన వారు కూడా ఉన్నారట.  తమ సోషల్ మీడియా అకౌంట్లు వినియోగించి సందేశాలు పోస్ట్ చేసేందుకు ఇంత రేటని ప్రముఖులు చెప్పడం ఒక్కటే ఈ కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ వెలికి తీయలేదు. ఇక నటుడు సోనూ సూద్ అయితే కోబ్రాపోస్ట్ విలేకరులు చెప్పిన పని చేయడానికి రూ.20 కోట్లు అడిగినట్లు సమాచారం. తర్వాత నెలకు రూ.2.50 కోట్లు కోరాడు. ఐదు లేదా ఏడు ట్వీట్లు చేస్తాను కానీ నా మెసేజ్ లు చాలా బలంగా, బాగుంటాయని మార్కెటింగ్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: