తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోయిన్ నయనతార. కెరీర్ ప్రారంభించిన ఇప్పటికీ పద్నాలు సంవత్సరాలు దాటుతున్నా..ఇంకా గ్లామర్ మెయింటేన్ చేస్తూనే ఉంది. ఓ వైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించి మెప్పిస్తుంది. తాజాగా తమిళంలో నయనతార 'ఐరా' చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో నయన్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నదని సమాచారం.
ఈ అంశమే ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. తమిళంలో ఈ చిత్రం విడుదలకి ముహూర్తం ఖరారైపోయింది. మార్చి 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే తెలుగు వెర్షన్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.
నయనతారకి ఈ చిత్రం మరో భారీ విజయాన్ని అందించడం ఖాయమనే మాట కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. గత కొంత కాలంగా విభిన్నమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది. ఇలా అన్ని వైపుల నుంచి నయనతార తన జోరును కొనసాగిస్తూ ఫుల్ బిజీగా వుంది.