శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అరంగేట్రం చేసిన దగ్గుబాటి రానా, ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఆతరువాత ఆయన, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో చేసిన భల్లాలదేవ పాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇక ఆ సినిమా తర్వాత రానాకు తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో ఆఫర్లు బాగా పెరిగాయి. 


ప్రస్తుతం రానా చేతిలో ఐదు సినిమాలు ఉండగా, ఆయన మరొక సినిమా కూడా ఓకే చెప్పినట్లు గా వార్తలు వస్తున్నాయి. ఇటీవల సిద్ధార్థ హీరోగా వచ్చిన గృహం అనే తమిళ డబ్బింగ్ సినిమా దర్శకుడు మిలింద్ రాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రానా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక సినిమాను విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై గోపీనాథ్ ఆచంట నిర్మించనున్నారని, ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన ఈ సినిమా ఆగస్టు నెలలో షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారట.

ఇకపోతే ఈ సినిమా హర్రర్ నేపథ్యంలోనే సాగుతుందని, అలానే రానా ఈ సినిమాలో ఒక డాక్టర్ పాత్రలో నటించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నేడో రేపో రానుందని తెలుస్తోంది. కాగా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: