రోబో 2.0 చివరికి నష్టాలను మిగిల్చింది. లైకా ప్రొడక్షన్ కు సుమారు 100 కోట్లు లాస్ వచ్చినట్టు సమాచారం. అయితే దీని ప్రభావం తరువాత శంకర్ తీయ బోయే సినిమా మీద పడింది. ఈ సినిమాకు 200 నుంచి 220 కోట్లు బడ్జెట్ అవుతుందని శంకర్ అంచనా ఇచ్చారు. అయితే లైకా ఈసారి జాగ్రత్త పడదల్చుకుంది. 220 కాదు, 250 కోట్ల లోపు బడ్జెట్ లో సినిమా తీసి, ఫస్ట్ కాపీ ఇస్తానని, అగ్రిమెంట్ చేయమని దర్శకుడు శంకర్ ను కోరింది. దానికి ఆయన ససేమిరా అంటున్నారని టాక్.

Image result for shankar

తాను బడ్జెట్, స్క్రిప్ట్ చెప్పానని, ఇంతే అవుతుందని ఎలా అగ్రిమెంట్ చేస్తానని శంకర్ మొండికేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే లైకా సంస్థ, ఇరవై ముఫై కోట్ల వరకు ఖర్చు చేసేసింది. అయినా కూడా ప్రాజెక్టును పక్కన పెట్టాలనే అనుకుంటున్నట్లు బొగట్టా. తెలుగు నిర్మాతలకు ఫోన్లుదీంతో దర్శకుడు శంకర్ సరైన నిర్మాత ఎవరు దొరుకుతారా? అని ఎంక్వయిరీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతంలో నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టు కోసం ముందుకు వచ్చారు.

Image result for shankar

కానీ ఆయన మళ్లీ వెనక్కు వచ్చేసారు. అందుకే శంకర్ తరపును తెలుగులో ఒకరిద్దరు తెలుగు భారీ నిర్మాతలకు ఫోన్ లు చేసినట్లు తెలుస్తోంది. అయితే 250 కోట్ల బడ్జెట్, శంకర్ రోబో 2 ఫలితం తెలిసిన ఎవ్వరూ అస్సలు ఆసక్తి కనబర్చలేదని తెలుస్తోంది. పైగా కమల్ హాసన్ హీరోగా సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదని, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో కూడా బిజీ అయిపోయారని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు ఎంత దూరంగా వుంటే అంత మంచిదని ఓ తెలుగునిర్మాత అన్నారు. అగ్రిమెంట్ చేయకతప్పదా?దీంతో మరోదారి లేక శంకర్ నిర్మాణ సంస్థ లైకా అడిగినట్లు 250 కోట్ల లోపులో సినిమా ఫస్ట్ కాపీ తీసి ఇస్తానని అగ్రిమెంట్ చేసుకోకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది. లేదూ అంటే ఇక సినిమా వుండదు. శంకర్ ఇన్నింగ్స్ దాదాపు ఇక్కడితో ముగిసిపోతాయి. ఇప్పటికే ఆయన ఖాతాలో రెండు భారీ డిజాస్టర్లు వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: