శరత్ కుమార్ కూతరు వరలక్ష్మి బోల్డ్ కామెంట్స్ చేయడం లో ఎప్పుడు వెనుకడుగు వేయదు. బోల్డ్‌గా నటించడమే కాదు.. బోల్డ్‌గా మాట్లాడటం కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నైజం. తమిళ బొద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్‌కి కోలీవుడ్‌లో డేరింగ్ నటిగా పేరుంది. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరలక్ష్మి శరత్ కుమార్ వరుస సినిమాలతో రాణిస్తోంది. ప్రస్తుతం ‘నాగకన్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Image result for varalakshmi sarathkumar

గతంలో ‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టమని.. తెలుగు హీరోల్లో తాను ప్రభాస్‌ను ఎక్కువగా అభిమానిస్తాను. నేను మాత్రమే కాదు ప్రస్తుతం దేశంలో ఎంతో మంది ఆయన్ను అభిమానిస్తూ ఉన్నారు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్ అయ్యా.. ప్రభాస్ స్టైల్, యాక్టింగ్ అంటే నాకు మహా పిచ్చి.. ప్రభాస్‌తో నటించే అవకాశం వస్తే క్షణం ఆలోచించకుండా ఓకే చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చిన వరలక్ష్మీ తాజాగా నేను ఎవరికైనా ఐలవ్యూ చెప్పాలనుకుంటే అది బాహుబలి ప్రభాస్‌కే చెబుతానని మనసులో మాటను బయటపెట్టేసింది.

Image result for prabhas

 వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్‌గా కంటే.. తమిళ స్టార్ హీరో విశాల్‌తో ప్రేమాయణంతో వార్తలతో పాపులర్ అయ్యింది. చాలా రోజులుగా విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ఎఫైర్ సాగుతోందంటూ వార్తలు వచ్చాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలని అటు విశాల్, ఇటు వరలక్ష్మి ఇద్దరూ ఖండించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: