‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడంతో ఈమూవీ నందమూరి కుటుంబాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ విషయాలను పట్టించుకొనట్లు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈమూవీకి ఎలాగ షాక్ ఇవ్వాలి అన్న విషయమై న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్న పరిస్థుతులలో వారికి ఒక మంచి ఆలోచన వచ్చినట్లు టాక్.
Poster of Lakshmi's NTR released in Tirupati.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు తమ కుటుంబ సభ్యులలోని కొందరికి ముందుగా చూపించాలని నందమూరి కుటుంబ సభ్యులు సెన్సార్ బోర్డ్ అధికారులకు ఒక ఉత్తరం వ్రాసినట్లు గాసిప్పులు వస్తున్నాయి. దీనితో ఎలర్ట్ అయిన సెన్సార్ వర్గాలు ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం తీసుకున్నప్పుడు వర్మ ఈ సూచనను పూర్తిగా తిరస్కరించినట్లు టాక్.
A still from Lakshmi's NTR
అంతేకాదు ఈ మూవీ విషయమై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నందమూరి కుటుంబ సభ్యులు కోర్టు ద్వారా తేల్చుకోమని వర్మ సెన్సార్ బోర్డు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఈమూవీ విడుదల కాకుండా న్యాయపరంగా పోరాటం చేద్దామని నందమూరి కుటుంబ సభ్యులలో కొందరు సూచిస్తున్నా మరికొందరు కీలక నందమూరి కుటుంబ సభ్యులు ఈ సూచనను తిరస్కరిస్తున్నట్లు టాక్.
Lakshmi's NTR
ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ఫెయిల్ అయిన పరాభవంతో పాటు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు న్యాయపరమైన చిక్కులు కలిగించే విషయంలో ఫెయిల్ అయితే మరింత అవమానంగా ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మౌనంగా ఉండటమే మంచిది అని అభిప్రాయ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీ విషయంలో ఎదో ఒకటి చేయమని నందమూరి కుటుంబ సభ్యుల పై ఒత్తిడి పెరిగి పోతున్న నేపధ్యంలో వారికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాల పైనా లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: