‘కథానాయకుడు’ ఘోర పరాజయం తరువాత రేపు విడుదల కాబోతున్న ‘మహానాయకుడు’ పై ఏమాత్రం అంచనాలు లేకపోవడంతో ఈమూవీ ఫలితం పై బాలకృష్ణ అభిమానులలో కూడ ఏమాత్రం ఆసక్తి లేదు. ఇలాంటి పరిస్థుతులలో రేపు విడుదల కాబోతున్న ఈమూవీ ప్రీమియర్ షోను ఈరోజు సాయంత్రం మహేష్ బాబు ఎఎంబి ధియేటర్ లో ప్రదర్శిస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 
Release date locked for 'NTR Mahanayakudu'
సాధారణంగా ఏమాత్రం పాజిటివ్ టాక్ లేని సినిమాకు విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేయరు. అయితే ఏ ధైర్యంతో ఇలాంటి ప్రీమియర్ షో ఈరోజు క్రిష్ బాలయ్యలు ఎందుకు వేస్తున్నారో అర్ధం కాని విషయంగా మారింది. ఈ ప్రీమియర్ షోకు బాలయ్య వీరాభిమానులతో పాటు కొన్ని మీడియా వర్గాలు కూడ వస్తున్నట్లు తెలుస్తోంది.
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ హిట్ అవ్వాలంటే ఏం చేయాలో మరి..?
దీనితో ఈమూవీ టాక్ ఈ రాత్రికే తెలిసిపోవడమే కాకుండా కొన్ని వెబ్ సైట్స్ ఈమూవీ రివ్యూలను ఈరోజు అర్దరాత్రిలోపే పెట్టే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థుతులలో పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు కాని నెగిటివ్ టాక్ వస్తే రేపటి మొదటిరోజు మొదటి ఆటకు ధియేటర్ల వద్ద కనీస ప్రేక్షకులు కూడ కనిపించకపోయే ఆస్కారం ఉంది.
NTR Mahanayakudu Rights - Available for Free?
దీనితో అత్యంత ధైర్యంతో బాలకృష్ణ అనుసరిస్తున్న ఈ వ్యూహం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారడమే కాకుండా ఈ ధైర్యం వెనుక ఎదో కారణం ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు అంచనాలు పెరిగిపోతున్న నేపధ్యంలో ‘మహానాయకుడు’ మూవీకి కనీసం పాజిటివ్ టాక్ అయినా తెచ్చుకోవాలని బాలకృష్ణ ఈ వ్యూహాలు అనుసరిస్తున్నట్లు అనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: