ఒక కామెడీ షో కొన్ని సంవత్సరాలపాటు బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని పొందడమే కాకుండా ఆ కార్యక్రమ రేటింగ్స్ పడిపోకుండా నిర్వహించడం అంత సాధారణమైన విషయం కాదు. బుల్లితెర టాప్ షోగా రేటింగ్స్ తెచ్చుకుంటున్న ‘జబర్దస్త్’ కార్యక్రమం పై ఎన్ని విమర్శలు వచ్చినా ఆ కార్యక్రమాన్ని ఆస్వాధించే ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు.
బూతు మూవీస్, నీచమైన షోలు ఎన్నో...
ఇలాంటి ఈకార్యక్రమం నాగబాబుకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా అతడి ఆర్ధిక సమస్యలు అన్నీ తీర్చివేసింది అంటే ఈ కార్యక్రమ రేంజ్ అర్ధం అవుతుంది. ఈ పరిస్థుతులలో ఈకార్యక్రమ విజయానికి సంబంధించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఈకార్యక్రమం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
సీరియస్ కంటెంటే కానీ..
చాలా మంది అనుకునే విధంగా తమ షో బూతు కామెడీ షో కాదని అంటూ అక్కడక్కడ తమ షోలో అడల్ట్ టచ్ కనిపించినా అందరూ తమ షోను ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే తమ షోకు ఈ రేటింగ్స్ వస్తున్న విషయాన్ని వివరించాడు మెగా బ్రదర్. అయితే తమ షోలో చమ్మక్ చంద్ర చేసే స్కిట్లులో మాత్రమే కొంత వల్గారిటీ ఉంటుందని అయినా అది కూడ శ్రుతిమించి ఉండదు అని చెపుతూ అది అతడి స్టైల్ అంటూ కామెంట్స్ చేసాడు నాగబాబు. 
మా ఇంట్లో అందరికంటే షార్ట్ టెంపర్ నేనే
అంతేకాదు సినిమాలలో విపరీతంగా వినిపించే బూతు డైలాగులు బూతు సీన్స్ పై ఏమాత్రం స్పందించని చాలామంది విమర్శకులు కేవలం ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఎందుకు కామెంట్స్ చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో ‘నా ఛానల్ నా ఇష్టం’ ద్వారా తాను పెడుతున్న వీడియోల గురించి నాగబాబు మాట్లాడుతూ ఈ వీడియోలకు మంచి స్పందన వస్తోందని చెపుతూ విమర్శలను హాస్యంతో రంగరించి చూపెడితే ఆ విషయాలు జనానికి ఏవిధంగా కనెక్ట్ అవుతుందో తన వీడియోల సక్సస్ ఒక ఉదాహరణ అని అంటున్నాడు ఈ మెగా బ్రదర్..   


మరింత సమాచారం తెలుసుకోండి: