హాలీవుడ్ కి చెందిన ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం ఐటమ్స్ సాంగ్స్ కి పరిమితం అయ్యింది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫోర్న్ ప్రపంచానికి దూరంగా ఉంటూ వస్తున్న సన్నీలియోన్   ప్రస్తుతం  ఒక స్త్రీగా, గృహిణిగా సంసార జీవితం హాయిగా ఉన్నానంటుంది. ఈ మద్య ఓ పాపను కూడా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.  ఐతే ఈ అమ్మడు ఛారిటీ సంస్థలకు, సామాజిక సంస్థలకు ప్రచారకర్తగా ఉంటూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నానంటుంది.
Image result for sunny leone govt job
తాజాగా బీహార్ లో పీహెచ్ఈడీ (పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్) విభాగం సివిల్ ఇంజినీర్ పోస్టులను ప్రకటించగా, సన్నీలియాన్ కూడా దరఖాస్తు చేసుకుందట. అయితే ఈ వార్త ఎవరో ఆకతాయి సోషల్ మీడియాలో హల్ చల్ చేసేందుకు పబ్లిసిటి చేసి ఉంటారనుకున్నా..ఈ విషయమై ఇంకా నిజం తేలలేదు. పీహెచ్ఈడీ అధికారులే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
Related image
జూనియర్ సివిల్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా, సన్నీ పేరు మీద ఒక అప్లికేషన్ వచ్చిందని, ఆమె ఇంజినీరింగ్ డిప్లమాలో 98.5 శాతం మార్కులు తెచ్చుకున్నట్టుగా దరఖాస్తులో రాశారని చెప్పారు. కాకపోతే ఆ అభ్యర్థి ఎవరు అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు..అయితే ఈ అభ్యర్థి నిజమా? లేదా సరదా కోసం ఆన్ లైన్ లో దరఖాస్తును పూరించారా అన్నది అంతు పట్టకుండా ఉందని అంటున్నారు. కాగా, బీహార్ లో ఇంజినీర్ ఉద్యోగాల దరఖాస్తుకు ఈ నెలాఖరు వరకూ సమయం ఉంది.  ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: