టాలీవుడ్‌లో వరుస విషాద సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌లే బుల్లితెర న‌టి ఝాన్సీ ఆత్మ‌హ‌త్య చేసుకోగా, నిర్మ‌త జ‌య అనారోగ్యంతో మ‌ర‌ణించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు డి.యస్.దీక్షితులు కూడా రెండు క్రితం కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సంస్కృత అధ్యాపకుడు, సినీగేయ రచయితగా సంగీత సామ్రాజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించి తనదైన శైలిలో అద్భుత పాటలతో ఆధ్యాత్మిక సినిమాలకు నిండుదనం తెచ్చిన సాహితీవేత్త, సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్‌ బుధవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్ననిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Image result for lyricist vedavyasa

ఆరోగ్యం విష‌మించ‌డంతో బుధవారం రాత్రి 9 గంటలకు ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. గురువారం బైరాగిపట్టెడలోని ఆయన స్వగృహం నుంచి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 1946లో జన్మించిన వరంగల్ జిల్లా కోమటిపల్లి అగ్రహారంలో ఆయన జన్మించారు.  శ్రీవైష్ణవి ఆచార్య పీఠానికి చెందిన పూర్వీకులు సమాజాన్ని ఆధ్యాత్మికత వైపు నడిపించాలన్న సంకల్పంతో కొన్ని శతాబ్దాల క్రితం వరంగల్‌ జిల్లా కోమటిపల్లి అగ్రహారంలో స్థిరపడ్డారు.  1968లో టీటీడీలోని ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య అధ్యాపకులుగా బోధన రంగంలోకి ప్రవేశించారు.

Image result for lyricist vedavyasa

సాహిత్య శాఖ అధ్యక్షుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. సినీ దర్శకుడు, రచయిత జేకే భారవి వేదవ్యాస రంగభట్టర్‌కు స్వయాన తమ్ముడు కావడం గమన్నార్హం.  1986లో తొలిసారి ఆయన 'రంగవల్లి' సినిమాకి పాటలు రచించారు. ఆ తరువాత 'శ్రీమంజునాథ', 'రామదాసు', 'పాండురంగడు', 'షిరిడీ సాయి', 'అనగనగా ఒక ధీరుడు', 'ఝుమ్మంది నాదం', 'ఓం నమో వెంకటేశాయ' ఇలా దాదాపు పదమూడు సినిమాలకు సాహిత్యం అందించారు. ప్రముఖ సాహితీవేత్త రంగ భట్టర్‌ మృతి పట్ల వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వేదవ్యాస మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: