సినిమాలలో హీరోలు హీరోయిన్ ప్రేమ కోసం విలన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి సంఘటన అల్లు శిరీష్ నిజ జీవితంలో కూడ చేసి చూపించి హీరోలకే హీరో అనిపించుకున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో అల్లు శిరీష్ ఒక తాగుబోతు టార్చర్ నుండి నిజంగానే హీరోయిన్ ను రక్షించిన విషయం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 రుక్సార్‌కు చేదు అనుభవం
ఆ సక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే అల్లు శిరీష్ తో 'ఎబిసిడి' మూవీ అమెరికన్ బార్న్ కంఫ్యూజ్డ్ దేశీ నిర్మిస్తున్న దర్శకుడు సంజీవ రెడ్డి వివరించాడు. నిన్న ఈమూవీ యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఆసక్తికర విషయాన్ని దర్శకుడు బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. 
 వాళ్లంతా మన ఫ్యామిలీనే
ఇక వివరాలలోకి వెళితే ఈమూవీలోని 'మెల్ల మెల్లగా' చిత్రీకరణ ఒక అవుట్ డోర్ స్పాట్ లో రోడ్డు పై జరుగుతున్న సమయంలో కొంతమంది తాగుబోతులు ఆ షూటింగ్ స్పాట్ మీదుగా వెళుతూ మధ్యలో ఆగి హీరోయిన్ రుక్సార్ పై బూతు కామెంట్స్ చేశారట. అయితే ఆ షూటింగ్ హడావిడిలో ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోకపోయినా అల్లు శిరీష్ పట్టించుకుని వారిని తన కారులో వెంటాడి వారిని క్యాచ్ చేయడమే కాకుండా వారిచేత హీరోయిన్ కు క్షమాణార్పణ చెప్పించాడట. 
Allu Sirish to star in Telugu remake of Dulquer Salmaan’s  hit film ABCD
దీనితో అల్లు శిరీష్ నిజమైన హీరో అంటూ నిన్న జరిగిన సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ఈమూవీ దర్శకుడు విపరీతంగా పొగిడాడు. ఇప్పటికే అనేక సార్లు విడుదల వాయిదా పడ్డ ఈమూవీ వచ్చే నెల మార్చి 21న విడుదల కాబోతోంది. ఈమధ్య కాలంలో ఒక్క హిట్ కూడ లేని ఈ అల్లువారి అబ్బాయికి ఈమూవీ హిట్ చాలా అవసరం. అయితే ఈమూవీతో చాలా సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎంత వరకు ఈ పరీక్షల సీజన్ లో యూత్ ని శిరీష్ తన థియేటర్ల వైపు రప్పించుకోగలుగుతాడు అన్న విషయం సమాధానం లేని ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి: