బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాజ్‌కుమార్ బ‌ర్జాత్య ఈ రోజు ముంబైలోని స‌ర్ హెచ్ఎన్ రిల‌యెన్స్ ఫౌండేష‌న్ హాస్పిటల్‌లో క‌న్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.   గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని స‌ర్ హెచ్ఎన్ రిల‌యెన్స్ ఫౌండేష‌న్ హాస్పిటల్‌లో కన్నుమూశారు.  రాజ్ కుమార్ బర్జాత్యా కుమారుడైన ప్రముఖ దర్శక నిర్మాత సూరజ్ ఆర్ బర్జాత్య  దర్శకత్వంలోనే వచ్చిన‘‘మైనే ప్యార్ కియా’’ తో  సల్మాన్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.
Image result for raj-kumar-barjatya
ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.  హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రానికి గాను ఆయన ఫిలిం ఫేర్ అవార్డు ని అందుకున్నారు. తన కెరీర్ లో 'వివాహ్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'హమ్ సాత్ సాత్ హై' వంటి చిత్రాలను నిర్మించారు. 
Image result for maine pyar kiya
రాజ‌శ్రీ ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్‌పై ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్‌పాయో( 2015), జానా పెహ్‌చానా(2011), ల‌వ్ యూ.. మిస్టర్ క‌ళాక‌ర్‌(2011), ఇసి లైఫ్ మైనే (2010), ఏక్ వివాహ్‌..ఐసా భాయ్ (2008), షాసు ఘ‌ర చాలిజిబి(2006), వివాహ్ (2006), మైనే ప్రేమ్ కీ దివానీ హూన్‌( 2003), హమ్ ప్యార్ తుమ్హీ సే కార్ బైతే(2002), హ‌మ్ సాత్‌- సాత్ హైన్: వుయ్ స్టాండ్ యునైటెడ్(1999), హ‌మ్ ఆప్‌కే హై కౌన్‌( 1994) చిత్రాల‌ని నిర్మించారు.

హమ్ ఆప్‌కే హై కౌన్ చిత్రానికి రాజ్‌కుమార్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు రాజ్ కుమార్ బర్జాత్యా.రాజ్ కుమార్ బర్జాత్యా మృతి పట్ల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియజేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: