తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు.  గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.  గతంలో హార్ట్ ఎటాక్, పారాలిటిక్ ఎటాక్ సమస్యలతో పోరాడుతూ, కోలుకున్న కోడి రామకృష్ణ, అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని..వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు.  దర్శకుడిగా కోడీ రామృష్ణ స్టార్ హీరోలతో అద్భుతమైన చిత్రాలు తీశారు.  అమ్మోరు,దేవి, అరుంథతి,అంజి మరికొన్ని గ్రాఫిక్ టెక్నాలజీతో తీసిన చిత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. దర్శకుడిగానే కాకుండా ఆయన పలు చిత్రాల్లో నటించారు.

మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, శత్రువు సూపర్ హిట్ చిత్రాలు.  గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.  సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాస్పిటల్‌కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్‌ని, కోడి రామకృష్ణ కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: