బాలయ్య ఫ్యాన్స్ అంటే అతే మరి. ఫుల్ మాస్. వారికి కావాల్సిన వినోదాన్ని నందమూరి కుటుంబం కొన్ని దశాబ్దాలుగా అందిస్తూ వస్తోంది. బాలయ్య కెరీర్ నాలుగున్న దశాబ్దాలు దాటింది. సెంచరీ కొట్టేశారు. ఇంకా నాటౌట్ అంటూ రెచ్చిపోతున్నారు. ఏ హీరో లేని విధంగా ఫుల్ ఎనర్జీతో ఏడాదికి రెండు సినిమాలను సెట్స్ మీద పెట్టడంలో బాలయ్యకు ఆయనే సాటి.


ఇదిలా ఉండగా బాలక్రిష్ణ అభిమానులకు ఈ నెల 22వ తేదీ  గుర్తుంచుకోదగిన దినంగా మారుతోంది. ఆ రోజున అన్న నందమూరి బయోపిక్ రెండవ భాగం మహా నాయకుడు రిలీజ్ ఉంది. అన్న గారు ముఖ్యమంత్రి కావడం ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆగస్ట్ వెన్నుపోటు, భార్య బసవతారం తో ఉన్న రిలేషన్,  ఆమె చివరి రోజులు ఎలా గడిచాయి,  అపుడు అన్న గారు ఎక్కడ ఉన్నారు, బసవతారకం హెల్త్ విషయంలో ఆయన పడ్డ బాధ ఇవన్నీ మహానాయకుడుతో కనిపిస్తాయని అంటున్నారు. ఈ మూవీ హిట్ అవుతుందని బాలయ్య మంచి ధీమాగా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ ని బాలయ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూండగానే మరో గుడ్ న్యూస్ కూడా అదే రోజు చెబుతున్నారు బాలయ్య


హిట్ కాంబో బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీకి ముహూర్తం షాట్ ఆ రోజున జరగనుంది. ఆ రోజున పూజా కార్యక్రమాలు జరిపి లాంచనంగా షూటింగ్ ప్రారంభిస్తారని టాక్. ఈ మూవీలో బాలయ్య రెండు పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్నారు. అందులో ఒకటి ముప్పయేళ్ళ నాటిదైతే రెండవది వర్తమాన కాలం. బలమైన సబ్జెక్ట్ తో బోయపాటి ఈ మూవీని రెడీ చేసిపెడుతున్నారు. బాలయ్య తన ఎంబీకే పతాకంపై మూడవ చిత్రంగా దీన్ని తీస్తున్నారు. సో బాలయ్య ఫ్యాన్స్ కు ఒకే రోజు రెండు పండుగలు అన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: