ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు అంతగా ఆకట్టుకోలేకపోయింది. వయసుడిగిన బాలయ్యను కుర్ర ఎన్టీఆర్ రూపంలో చూపించడం ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయిందన్న టాక్ వచ్చింది.

ntr mahanayakudu images కోసం చిత్ర ఫలితం


ఇప్పుడు మహానాయకుడు సినిమా విడుదలైంది. కానీ కేవలం సినిమా కథను బసవతారకం కోణంలో చూపించడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ అవుతోంది. మొదటి నుంచి ఈ సినిమాను ఎన్టీఆర్ బయోపిక్ అంటూ చెబుతూ వచ్చారు. కానీ ఈ సినిమా ఎన్టీఆర్ జీవితాన్ని అసంపూర్తిగానే చూపించింది.

ntr mahanayakudu images కోసం చిత్ర ఫలితం


ఎన్టీఆర్ భార్య బసవతారకం 1989లో మరణించారు. దాంతో ఈ సినిమా అప్పటితోనే ముగుస్తుంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆటుపోట్లు ప్రధానంగా నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ కీలకంగా చూపించారు. వాస్తవానికి ఆ తర్వాతే ఎన్టీఆర్ జీవితంలో అసలు కథ మొదలైంది.



నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ ను గద్దెదించి అక్రమంగా సీఎం కావడం .. మళ్లీ ఎన్టీఆర్ ఉద్యమం చేసి ఆయన్ను దింపి ముఖ్యమంత్రి కావడం.. ఇందులో చంద్రబాబు సహకారం.. ఇదీ హైలెట్ గా చూపించారు. కానీ ఆ తర్వాత ఆయన పదవి కోల్పోవడం.. జీవిత చరమాంకం ఇవేమీ సినిమాలో ఉండకపోవడం ప్రేక్షకులకు వెలితిగానే ఉంది. కనీసం రేఖామాత్రంగానైనా ఆ ఎపిసోడ్ ఉంటే సినిమాకు నిండుదనం వచ్చేది.


మరింత సమాచారం తెలుసుకోండి: